ఇలా చేయకుంటే ఊపిరితిత్తులు పాడైపోతాయ్!

న్యూఢిల్లీ: గాలి కాలుష్యం వల్ల మన శరీరంలో ప్రధానంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కాలుష్యస్థాయిలు ఎక్కువగా ఉంటే శ్వాసకోశ కేసులు మరింత పెరిగే అవకాశముంది. దేశ రాజధాని ఢిల్లీ, దాని ప్రక్కనే ఉన్న నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో గాలి నాణ్యత క్షీణిస్తూనే ఉండడంతో శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే కొవిడ్-19తో బాధపడుతున్న జనాలకు కాలుష్యం అనేది ప్రధాన సమస్యగా మారే ప్రమాదముందని అంటున్నారు. ఉబ్బసం, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ)లాంటి శ్వాసకోశ కేసుల సంఖ్య 4-5 రెట్లు పెరిగిందని, ప్రజలు తీవ్ర లక్షణాలతో బాధపడుతున్నారని బీఎల్కే దవాఖానకు చెందిన డాక్టర్ సందీప్ నాయర్ పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రజలు ఇంటి లోపలే ఉండాలని సలహా ఇస్తున్నారు.
ఊపిరితిత్తులపై వాయుకాలుష్యం ప్రభావం..
కలుషితమైన గాలి పీల్చడంవల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. పరిస్థితి విషమిస్తే అకాల మరణాలు కూడా సంభవిస్తాయని తెలుపుతున్నాయి. బ్రిటిష్ ఊపిరితిత్తుల ఫౌండేషన్ ప్రకారం, బహిరంగ వాయు కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతుంది. దీర్ఘకాలంగా వాయుకాలుష్యం ఉంటే ఉబ్బసం వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలాగే, అధిక స్థాయిలో కాలుష్యం ఆస్తమా, సీవోపీడీకి మూలమవుతుంది. ఉబ్బసం ఉన్నవారు కాలుష్యం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో రిలీవర్ ఇన్హేలర్ను వెంట ఉంచుకోవాలి.
మంచి జీవనశైలి విధానాలు..
- స్థిరమైన శారీరక శ్రమ.
- ధూమపానం, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి.
- ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి.
- ఆకుకూరలు, బీన్స్, కాయధాన్యాలు, పసుపు, బెర్రీలు, అక్రోట్లను ఆహారంలో చేర్చుకోవాలి. గ్రీన్ టీ తాగాలి.
- సమతులాహారం తీసుకుంటూ ఎక్కువగా నీళ్లు తాగాలి.
- అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. ఒకవేళ వెళ్లినా మాస్కులాంటివి ధరించాలి.
- పొగాకు ఉత్పత్తులు (ప్రధానంగా సిగరెట్లు) రక్తపోటు, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, సీవోపీడీ, క్యాన్సర్ (ఊపిరితిత్తులు, గొంతు, అన్నవాహిక, కడుపు, మూత్రాశయం మొదలైనవి)లాంటి అనేక ఆరోగ్య రుగ్మతలకు దారితీస్తాయి. టీబీ, న్యుమోనియాలాంటి ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. వంధ్యత్వం, అంగస్తంభన, గర్భ సమస్యలు వస్తాయి. అందుకే వీలైనంత తొందరగా పొగాకు ఉత్పత్తులను మానేయాలి.
ధూమపానాన్ని ఇలా తగ్గించుకోండి..
- పొగతాగడం మానేయాలనుకున్న తేదీని మొదట సెట్ చేసుకోండి.
- మీ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులకు తెలియజేయండి.
- మీ ఎదుట కూడా ఎవరూ పొగతాగవద్దని అభ్యర్థించండి.
- మీ చుట్టుపక్కల ఉన్న పొగాకు ఉత్పత్తులను తొలగించండి.
- ధూమపానంతోపాటు మద్యపానానికి దూరంగా ఉండాలి.
- ధూమపానం వల్ల కలిగే నష్టాలు.. మానేస్తే కలిగే ప్రయోజనాల గురించి నిత్యం చదవండి.
- పొగతాగడం వెంటనే మానేయలేరు. కొంత సమయం పడుతుంది. మెల్లమెల్లగా ధూమపానానికి దూరం జరగండి.
- పొగతాగడం మానేసిన కొద్ది నెలల్లోనే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యాన్సర్, ఇతర ధూమపాన సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కరోనా దెబ్బ.. మరో 12 కోట్ల మంది పేదరికంలోకి..
- బైడెన్ వలస విధానానికి గూగుల్, ఆపిల్ సీఈఓల ప్రశంసలు
- రాష్ట్రానికి ఎస్టీ రెసిడెన్షియల్ లా కాలేజీ
- నేతాజీ కార్యక్రమం : దీదీకి తృణమూల్ ఎంపీ మద్దతు
- నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మ దహనం
- బోస్ మరణంపై నెహ్రూ ఎందుకు దర్యాప్తు చేయించలేదు..?: బీజేపీ ఎంపీ
- నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ : మంత్రి అజయ్‌కుమార్
- మీ అబ్బాయికి కాస్త చెప్పండి.. ప్రధాని మోదీ తల్లికి రైతు లేఖ
- రూ. పది కోట్లకు హ్యాకర్ల స్కెచ్
- ఆ మ్యాచ్ నుంచే స్టేడియంలోకి ప్రేక్షుకులకు అనుమతంట!