శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Apr 22, 2020 , 16:30:27

ఆయుష్షు పెంచే 5 అంశాలు

ఆయుష్షు పెంచే 5 అంశాలు

వ‌య‌సు అయిపోయిన వారు తిరిగి మ‌ర‌లా యవ్వనంగా త‌యార‌వ్వాలంటే అప్పట్లోఅమృతం తాగేవారని చెబుతారు. ఇదంతా సినిమాలో చూసిందే కానీ నిజంగా ఎక్కడా జరగలేదు. నిజంగా అలా ఆయుష్షు పెంచుకోవాలంటే ఈ ఐదు అంశాలు త‌ప్ప‌కుండా పాటించాలి. ఇలా చేస్తే మ‌హిళ‌లు 14 ఏండ్లు, పురుషులు 12 ఏండ్ల‌పాటు ఆయుష్షును పొడిగించుకోవ‌చ్చ‌ని హార్వ‌ర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ ప‌రిశోధ‌కులు గుర్తించారు. 34 ఏళ్ల పాటు మహిళల, 27 ఏళ్ల పాటు పురుషుల గణాంకాలను పరిశీలించి ఈ విషయాన్ని వివరించారు. 

1. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. 

2. శరీర బరువు తగినంత ఉండేలా చూసుకోవడం. 

3. అతిగా మద్యం తీసుకోకుండా ఉండటం.  

4. ధూమపానానికి దూరంగా ఉండటం.

5. ప్రతి రోజూ వ్యాయామం చేయడం వంటి అలవాట్లు ఉంటే ఆయుష్షును పెంచుకోవచ్చని తెలిపారు.

ఈ ఐదు అంశాలను పాటించేవారు ఇతరులతో పోలిస్తే 74 శాతం మంది అకాల మృత్యువాత పడలేదని చెప్పారు. జీవనశైలి మార్పులు చేసుకుని వ్యాధులు రాకుండా జీవనకాలాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. ఈ ఐదు అంశాలను పాటిస్తే గుండెజబ్బుల ద్వారా మరణించడం తగ్గడంతో పాటు, కేన్సర్‌ కారణంగా మరణాలు కూడా తగ్గుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు.


logo