సీజనల్ సమస్యలను దూరం చేసే రెసిపీ...!

Oct 30, 2020 , 19:31:57

హైదరాబాద్ : జలుబు, దగ్గు వంటి సమస్యలు అన్ని సీజన్లలో వస్తుంటాయి. అయితే మార్కెట్లో అనేక మందులు ,సిరప్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి కాలానుగుణ వ్యాధులను నయం చేసేందుకు సహజ సిద్ధంగా లభించే పదార్థాలతో ఓ రెసిపీ ఉంది.దీనినే కాషాయం అంటారు. దీని ద్వారా వెంటనే ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. జ్వరం, ఉబ్బసం, ఊపిరితిత్తుల రుగ్మతలు, గుండె జబ్బులు,ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటానికి మీకు సహాయపడుతుంది. ఇది అన్ని రకాల బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి మన శరీరాన్ని చాలా సమర్థవంతంగా రక్షిస్తుంది. 

రెసిపీనీ ఇంట్లో నే తయారు చేసుకోవచ్చిలా...!   

కావలసినవి

రెండు కప్పులు - నీరు

తగినన్ని తులసి ఆకులు 

అర టీ స్పూన్ - నల్ల మిరియాలు పొడి

అర టీ స్పూన్ - శొంఠి పొడి

ఒక టీ స్పూన్ - తాటి బెల్లం 

తయారీ విధానం...! 

* ఒక పాత్ర లో నీరు పో సి, తులసి ఆకులను తుంచివేయాలి;   

* నీటి రంగు కొద్దిగా మారిన తర్వాత, నల్ల మిరియాలు పొడి,  శొంఠిపొడి, తాటి బెల్లం   వేసి మరికొన్ని నిమిషాలు మరిగించాలి.

ఎలా వాడాలి?

తులసి కషాయాన్ని వేడిగా తాగాలి, దీని ద్వారా దగ్గు ,జలుబు నుంచి  త్వరగా ఉపశమనం పొందవచ్చు. రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే తప్పనిసరిగా ఫలితం కనిపిస్తుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD