గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Feb 24, 2020 , 06:48:54

దంత సంరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలి..

దంత సంరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలి..

వనపర్తి : గ్రామీణ ప్రాంతాల్లో దంత సంరక్షణ, దంత వైద్యంపై మరింత అవగాహన అవసరమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖమంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. అఫ్జల్‌గంజ్‌లోని ప్రభుత్వ దంత కళాశాల, దవాఖాన ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా, కొత్తకోట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దంత వైద్య శిబిరానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అన్నిరకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దంత సంరక్షణపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరముందన్నారు.

నగరంలోని ప్రభుత్వ దంత కళాశాల-దవాఖాన వైద్య సిబ్బంది ప్రత్యేక శిబిరాల ద్వారా గ్రామీణ ప్రాంతవాసులకు దంత సంరక్షణపై అవగాహన కల్పిస్తూ వైద్యసేవలు అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ దంత కళాశాల ఆర్‌ఎంవో డాక్టర్‌ జగదీశ్వర్‌ మాట్లాడుతూ.. దంత వైద్య శిబిరంలో మొత్తం 500 మందికి దంత పరీక్షలు నిర్వహించామన్నారు. అందులో 400 మందికి వివిధ రకాలైన దంత సమస్యలు గుర్తించి చికిత్స అందించడంతోపాటు దంత సంరక్షణపై అవగాహన కల్పించామని వివరించారు. కార్యక్రమంలో డా.కె.వాసవి, డా.సృజన, డా.ఎన్‌.ఉజ్వల, డా.డీఎస్‌ గాయత్రి పాల్గొన్నారు. 


logo