టేస్ట్ కి టేస్టు.. హెల్త్ కి హెల్తు.. సమ్మర్‌స్పెషల్


Tue,April 25, 2017 06:09 PM

ఎండలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటుతున్నది. దీనికి తోడు వడగాలు. వడ దెబ్బకు శరీరం డీహైడ్రేషన్ అవుతున్నది. ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలంటే చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలంటున్నారు. వైద్యులు. వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే మన సాంప్రదాయ ఆహారం అంబలి ఎంతో మంచిదంటున్నారు. రాగులు, జొన్నలు, సజ్జలు, బియ్యంతో చేసిన అంబలి సమ్మర్‌లో ఎక్కువగా తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు డీహైడ్రేషన్ బారిన పడకుండా అంబలి కాపాడుతుంది. రాగులు శరీరానికి చలువ. వాటిలో క్యాల్షియం, ఐరన్, ఫైబర్, మినరల్స్, ఐయోడీన్‌లు ఎక్కువగా ఉంటాయి. రాగి జావ తయారు చేసుకోవడం కూడా చాలా సులువే. 5 నిమిషాల్లో రెడీ అవుతుంది.

తయారీ విధానం
ఒక చిన్న కప్పు రాగిపిండిని తీసుకుని దాన్ని నీళ్లతో లూజ్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా. చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో మూడు లేదా నాలుగా గ్లాసుల నీళ్లు తీసుకుని మరగించాలి. మరిగే నీళ్లలో లూజ్ చేసుకున్న రాగి పిండిని పోయాలి. పోసేటప్పుడు కలుపుతూ పోయాలి. అలా చేస్తే ఉండలు కట్టదు. మంటను తగ్గించి రెండు నిమిషాలు ఉడికించాలి. అంతే రాగి జావ రెడీ.

కాస్త చల్లారిన తరువాత సల్ల యాడ్ చేసుకుని తాగితే సూపర్ రాగి జావ.. టేస్ట్‌కి టేస్ట్ కి టేస్టు.. హెల్త్ కి హెల్తు

4213

More News

VIRAL NEWS