చలికాలంలో చర్మాన్ని కాపాడుకోండిలా..

హైదనాబాద్ : చలికాలం వచ్చిదంటే చాలు చర్మం పొడిబారి, పగుళ్లు వస్తుంటాయి. రకరకాల లోషన్లు, క్రీములు రాసుకుంటున్నా కూడా చర్మం కాసేపటికే మళ్లీ మామూలు స్థితికే వస్తుంటుంది. పొడిబారి, పగుళ్లు రావంతో పాటు మంట, దురద లాంటి సమస్యలు కూడా వింటర్ లో ఎక్కువగా వస్తుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.
అవేంటో తెలుసుకుని మీరు కూడా ట్రై చేయండి..
1. బాగా వేడి నీరు లేదా చల్లటి నీటితో స్నానం చేయడానికి బదులు గోరు వెచ్చటి నీటితో చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
2. చల్లగా ఉంది కాదా నీళ్లు తాగలేకపోతున్నాం అనుకోకుండా.. పుష్కలంగా నీరు తాగడం, ఆకుకూరల్ని ఎక్కువ తినడం వల్ల స్కిన్ హెల్తీగా ఉంటుంది.
3. బొప్పాయి గుజ్జును.. నిమ్మరసంతో కలిపి రాసుకోవడం వల్ల చలికాలంలో కూడా చర్మం మిలమిలా మెరుస్తుంది.
4. ఎండలేదు కదా అని సన్ స్క్రీన్ రాసుకోవడం అస్సలు మానేయకండి. సన్ స్క్రీన్ చలికాలంలోనూ మీ చర్మాన్ని దుమ్ము, ధూళి లాంటి వాటి నుంచి కాపాడుతుంది.
5. మాయిశ్చరైజ్, మాయిశ్చరైజ్, మాయిశ్చరైజ్ .. ఇది చలికాలంలో మీ చర్మాన్ని రక్షించే మంత్రం. ముఖ్యంగా రాత్రి పడుకునేముందు మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోవద్దు.
6. మీ చర్మ సౌందర్యం కోసం మీరు రోజూ చేసే వాటిని అస్సలు మానేయకూడదు. ఇంట్లోనే ఉన్నా సరే.
7. పొడిబారిన, పగిలిన పెదవులను పదే పదే నాలుకతో తడపకూడదు. ఇలా చేయడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. దీనికోసం మంచి లిప్ బామ్ తప్పనిసరిగా వాడండి.
8. చలికాలంలో చర్మం పొడిగా మారి దురద పెడుతుంది. ఇలాంటప్పుడు దాన్ని గట్టిగా గీకడం వల్ల అది మరింత డ్రై అయి.. పగలడం మొదలవుతుంది.
9. మామూలుగా చేసినట్లు చలికాలంలోనూ గంటల తరబడి స్నానం చేయడం వల్ల చర్మం మరింత పొడిబారే అవకాశాలు ఉన్నాయి.
10. ముఖ్యంగా వింటర్ సీజన్లో నాచురల్, ఆర్గనిక్ సబ్బులనే వాడటం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకున్న వారిమి అవుతాం.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- బైడెన్ ప్రమాణ స్వీకారానికి ఒబామా, క్లింటన్, బుష్
- ట్రాఫిక్ నిర్వహణపై జీహెచ్ఎంసీ సమావేశం
- బైక్ను ఢీకొన్న లారీ.. దంపతుల సహా మరో మహిళ మృతి
- 18 నెలలపాటు వ్యవసాయ చట్టాల అమలు నిలిపివేత
- ‘క్రాక్’ సినిమాలో రవితేజ కొడుకుగా నటించిన బుడ్డోడెవరో తెలుసా..?
- ‘ది బీస్ట్’.. బైడెన్ ప్రయాణించే కారు విశేషాలు ఇవే..
- ‘ఓటిటి రిలీజ్పై స్రవంతి రవికిషోర్ సంచలన వ్యాఖ్యలు’
- సత్తా చాటితేనే సర్కారు కొలువు
- సురవరం జయంతి ఉత్సవాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష
- 17 అంశాలపై బైడెన్ తొలి సంతకం