సోమవారం 25 మే 2020
Health - Apr 02, 2020 , 21:59:26

చెవిలో సమస్య.. గుర్తించడం ఎలా?

చెవిలో సమస్య.. గుర్తించడం ఎలా?

  • చెవిలో నొప్పి ఉన్నదంటే ఏ ఇన్‌ఫెక్షనో అనే అనుమానంతో డాక్టర్‌ దగ్గర చూపించుకుంటాం. కాని చిన్నపిల్లలు నొప్పి ఉందని చెప్పలేరు. మరి వాళ్లలో సమస్య ఎలా గుర్తించాలి? కొన్నిసార్లు నొప్పి లేకపోయినా వేరే లక్షణాల ద్వారా కూడా చెవిలో సమస్య ఉందని గుర్తించవచ్చు. అదెలాగంటే..
  • చెవిలో సమస్య ఉన్నప్పుడు చిన్నారుల్లో గాని, పెద్దవారిలో గాని కనిపించే మొదటి లక్షణం చెవి బరువుగా అనిపించడం. చెవిపోటు, సరిగ్గా వినిపించకపోవడం, శరీరం సమతుల్యత దెబ్బతిని కళ్లు తిరగడం, వికారం, వాంతులు, పదే పదే చెవిలో నుంచి చీము కారడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇఎన్‌టి డాక్టర్‌ను కలవాలి. 
  • నెలల శిశువుల్లో అయితే వాళ్ల సమస్యను చెప్పలేరు. కానీ ఇలాంటప్పుడు వారిలో చెవిలో సమస్యలను, వినికిడి లోపాలను గుర్తించడం కష్టమే. అయితే ఆటైటిస్‌ మీడియా లాంటి చెవి సమస్య ఉన్న శిశువులు తరచుగా చెవిని లాగడం, గోకడం చేస్తుంటారు. తరచుగా ఏడుస్తుంటారు. జ్వరం, వాంతులు, చెవిలో నుంచి ద్రవం కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు వెంటనే డాక్టర్‌ను కలవాలి.
  • నిర్లక్ష్యం చేస్తే ఇది వినికిడి సమస్యలకు దారి తీయవచ్చు. జలుబు చేసినప్పుడు కూడా చెవిలో నొప్పి ఉందని అంటుంటే తప్పనిసరిగా ఇఎన్‌టి డాక్టర్‌ను కలవాలి. 


logo