గర్భిణీలు విటమిన్ బి ఉన్న ఆహారాలను తీసుకుంటే పుట్టబోయే పిల్లల్లో మెదడుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ మేరకు జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్‌లో సదరు అధ్యయనానికి చెందిన వివరాలను కూడా ప్రచురించారు. కోలిన్ అనే పోషక పదార్థం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలో మెదడుకు సంబంధించిన సమస్యలు రావని, అలాగే మానసికంగా దృఢంగా ఉంటారని సైంటిస్టులు చెబుతున్నారు. అదేవిధంగా షిజోఫ్రీనియా వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చని వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గర్భిణీలు జలుబు, ఫ్లూ జ్వరం రాకుండా చూసుకోవాలని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. గర్భంతో ఉన్న సమయంలో తల్లులు ఆ సమస్యలను ఎదుర్కొంటే పుట్టబోయే పిల్లల్లో మానసిక అనారోగ్య సమస్యలు వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.