గర్భిణీలు ఈ ఆహారాలను అస్సలు తీసుకోరాదు..!


Mon,October 22, 2018 05:05 PM

పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా జన్మించాలన్నా, బిడ్డ పుట్టాక తాము ఆరోగ్యంగా ఉండాలన్నా.. గర్భిణీలు సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సిందేనని వైద్యులు చెబుతుంటారు. పిండం ఎదుగుతున్న సమయంలోనే గర్భిణీలు నిత్యం పౌష్టికాహారం తీసుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇది తల్లికే కాదు, బిడ్డ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే గర్భంతో ఉన్న స్త్రీలు పోషకాల కోసం పలు ఆహారాలను తీసుకోవడం ఎంత ముఖ్యమో కొన్ని రకాల ఆహారాలను తీసుకోకపోవడం కూడా అంతే ముఖ్యం. గర్భంతో ఉన్న వారు కొన్ని ఆహారాలను తినకూడదు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. పచ్చి బొప్పాయి
గర్భిణీలు బాగా పండిన బొప్పాయి పండ్లను చాలా తక్కువ మొత్తంలో తీసుకుంటే ఏమీ కాదు. కానీ పచ్చి బొప్పాయి పండ్లను మాత్రం తినరాదు. ఎందుకంటే వాటిల్లో ఉండే లేటెక్స్, పాలవంటి పదార్థం గర్భాశయంపై ప్రభావం చూపుతుంది. దీంతో అబార్షన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చి బొప్పాయి పండ్లను గర్భిణీలు తినరాదు.

2. వంకాయ
వంకాయలో ఫైటో హార్మోన్లు ఉంటాయి. ఇవి డైయురెటిక్ విభాగానికి చెందినవి. అయితే వంకాయలను సాధారణ స్త్రీలు తింటే రుతు క్రమం సరిగ్గా ఉంటుంది. కానీ గర్భిణీలు మాత్రం తినరాదు. ఇవి శరీరంలో వేడిని కలిగిస్తాయి. అబార్షన్‌కు దారి తీసేలా చేస్తాయి. కనుక గర్భిణీలు వంకాయలను తినరాదు.

3. నువ్వులు
నువ్వులను తింటే గర్భం రాదు. వచ్చినా అబార్షన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని కూడా తినకపోవడమే ఉత్తమం. వీటికి బదులుగా పిస్తా, వాల్ నట్స్, ఎండు ద్రాక్ష, బాదం పప్పు తింటే మేలు జరుగుతుంది.

4. సోంపు, మెంతులు
వీటిల్లో ఫైటో ఈస్ట్రోజెన్స్ ఉంటాయి. ఇవి గర్భాశయంపై ప్రభావం చూపిస్తాయి. అబార్షన్ అయ్యేలా చేస్తాయి. కాబట్టి వీటిని కూడా గర్భిణీలు తినరాదు.

5. టేస్టింగ్ సాల్ట్
దీన్నే అజినోమోటో అంటారు. చైనీస్ ఫాస్ట్ ఫుడ్, బేకరీ పదార్థాల్లో రుచి కోసం దీన్ని ఎక్కువగా వాడతారు. అయితే ఈ పదార్థం కలిసిన ఆహారాలను గర్భిణీలు తినరాదు. తింటే కడుపులో పెరుగుతున్న బిడ్డ మెదడుపై ప్రభావం పడుతుంది. కాబట్టి టేస్టింగ్ సాల్ట్‌కు దూరంగా ఉండాలి.

5735

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles