ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Health - Sep 01, 2020 , 18:14:54

క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత ఈ ప‌ని చేస్తున్నారా? జాగ్ర‌త్త‌!

క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత ఈ ప‌ని చేస్తున్నారా?  జాగ్ర‌త్త‌!

ఒక‌సారి క‌రోనా వ‌చ్చి నెగ‌టివ్ వ‌చ్చిన త‌ర్వాత శ‌రీర‌కంగా ఎంతో బ‌ల‌హీన‌త‌కు గుర‌వుతారు. త‌గ్గిపోయింది క‌దా అని మ‌ర‌లా పాత లైఫ్‌స్టైల్‌కు అల‌వాటు ప‌డ‌డం స‌బ‌బు కాదు. దీనివ‌ల్ల మ‌రికొన్ని అన‌ర్థాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా క‌రోనా నెగ‌టివ్ వ‌చ్చిన త‌ర్వాత ప్రాణామాయం అస‌లు చేయ‌కూడ‌ద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మ‌రి చేస్తే ఏమ‌వుతుందో కూడా తెలియ‌జేశారు. అదేంటంటే..

కరోనా నుంచి కోలుకున్న త‌ర్వాత ఊపిరితిత్తులు బాగా బ‌ల‌హీన‌ప‌డుతాయి. ఒక‌వేల వీరికి గ‌నుక ఎసిడిటీ ఉంటే మ‌రింత ప్ర‌మాదానికి గుర‌వుతారు. వీరు ప‌డుకున్న‌ప్పుడు గొంతు నుంచి వ‌చ్చే యాసిడ్లు ఊపిరితిత్తుల్లోకి చేరుతాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ యాసిడ్లు ఊపిరితిత్తుల‌ను నెమ్మ‌దిగా ప‌నికిరాకుండా మార్చేస్తాయి. అందుకే ఎసిడిటీ ఉన్న‌వాళ్లు వైద్యుల స‌ల‌హా తీసుకోవాలంటున్నారు. ఇక‌పోతే ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించేవాళ్లు యోగాస‌నాలు వేసేస్తుంటారు. ముఖ్యంగా ప్రాణామాయం అస‌లు చేయ‌కూడ‌దంటున్నారు. దీనివ‌ల్ల శ్వాస తీసుకోవడం అసౌక‌ర్యంగా ఉంటుంది. ప్రాణామాయం చేయ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల మీద ప‌గుళ్లు ఏర్ప‌డుతాయి. అందుక‌నే అలోమ‌, విలోమ వ్యాయామాలు చేస్తే బెట‌ర్ అంటున్నారు నిపుణులు. 


logo