e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News ఈ ఐదు అల‌వాట్ల‌తో దీర్ఘాయువు

ఈ ఐదు అల‌వాట్ల‌తో దీర్ఘాయువు

ఈ ఐదు అల‌వాట్ల‌తో దీర్ఘాయువు

న్యూయార్క్ : ఎలాంటి అనారోగ్యం లేకుండా నిండు నూరేండ్లు పంతోషంగా జీవించాల‌ని అనుకోని వారుండ‌రు. ఉరుకుల ప‌రుగుల జీవితం, ఒత్తిళ్ల న‌డుమ యాభై ఏండ్లు రాక‌ముందే వ్యాధులు, నిస్స‌త్తువ మీద‌ప‌డుతున్నాయి. యాభై ఏండ్ల వ‌య‌సు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఐదు ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాట్ల‌ను పాటిస్తే చాలా కాలం పాటు ఎలాంటి వ్యాధుల బారిన‌ప‌డ‌కుండా ఉండ‌టంతో పాటు దీర్ఘాయువును పొంద‌వ‌చ్చ‌ని హార్వ‌ర్డ్ అథ్య‌య‌నం వెల్ల‌డించింది.

మ‌ధ్య‌వ‌య‌సులో ఈ ఐదు అల‌వాట్ల‌ను అల‌వ‌రుచుకుంటే చాలా ఏండ్ల పాటు టైప్ 2 మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి తీవ్ర అనారోగ్యాల‌కు గురికాకుండా ఉండ‌వ‌చ్చ‌ని హార్వ‌ర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ నిర్వ‌హించిన తాజా అథ్య‌య‌నం తేల్చింది. ఈ స్టడీ వివ‌రాలు బీఎంజేలో ఆన్లైన్ లో ప్ర‌చురిత‌మ‌య్యాయి. ఆరోగ్య‌క‌ర‌మైన ఈ ఐదు అల‌వాట్ల‌తో మ‌నిషి జీవిత కాలం పెంచుకోవ‌చ్చ‌ని వెల్ల‌డైందని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. ఆరోగ్య క‌ర‌మైన అల‌వాట్ల‌ను చూద్దాం..

- Advertisement -


ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం : గుండె జ‌బ్బులు, ఒబెసిటీ, కొవ్వు పేరుకుపోవ‌డం వంటి అనారోగ్యాల‌కు దారితీసే ప‌రిస్థితిని ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారంతో నియంత్రించ‌వ‌చ్చు. స‌మ‌తుల ఆహారాన్ని మితంగా, శుచిగా తీసుకోవాలి. ఆహారంలో పోష‌కాలన్నీ ల‌భించేలా చూసుకోవాలి.


వ్యాయామం : శారీర‌క‌, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం కీల‌కం. దీంతో పాటు రోజును ఉత్సాహంగా, ఆహ్లాదంగా గ‌డిపేందుకూ వ్యాయామం ఉత్ప్రేర‌కంగా ప‌నిచేస్తుంది. వ్యాయామంతో బ‌రువు త‌గ్గ‌డం ద్వారా ప‌లు వ్యాధుల ముప్పును త‌ప్పించుకోవ‌చ్చు.


బ‌రువు నియంత్ర‌ణ : అధిక బ‌రువు గుండె జ‌బ్బులు, ర‌క్త‌పోటు, మ‌ధుమేహం వంటి ప‌లు వ్యాధుల‌కు దారితీసే ముప్పు ఉండ‌టంతో ఆరోగ్య‌క‌ర‌మైన బ‌రువును ఎప్ప‌టికీ మెయింటెన్ చేస్తుండాలి. బీఎంఐ 18.5 నుంచి 25కు మించ‌కుండా చూసుకోవాలి.


ఆల్క‌హాల్ కు దూరం : మ‌ద్యం మితంగా తీసుకోకుండా మితిమీరితే శరీరం వ్యాధుల‌కు నిల‌య‌మ‌వుతుంది. రోజుకు గ్లాసుకు మించి మ‌ద్యం తీసుకుంటే శ‌రీరాన్ని వ్యాధుల‌కు మ‌న‌మే ద‌గ్గర చేసిన వారం అవుతాం.


స్మోకింగ్ కు చెక్
: పొగ‌తాగ‌డం ఆరోగ్యానికి ప్ర‌మాద‌క‌ర‌మ‌ని నిపుణులు ఎప్ప‌టి నుంచో హెచ్చ‌రిస్తున్నారు. స్మోకింగ్ తో క్యాన్స‌ర్, గుండె జ‌బ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, మ‌ధుమేహం, శ్వాస‌కోశ వ్యాధుల ముప్పు ఉంద‌ని అమెరిక‌న్ సీడీసీ హెచ్చ‌రిస్తోంది. స్మోకింగ్ కు దూరం కావడం ద్వారా ప‌లు వ్యాధుల బారిన‌ప‌డ‌కుండా ఆరోగ్యం కాపాడుకోవ‌చ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈ ఐదు అల‌వాట్ల‌తో దీర్ఘాయువు
ఈ ఐదు అల‌వాట్ల‌తో దీర్ఘాయువు
ఈ ఐదు అల‌వాట్ల‌తో దీర్ఘాయువు

ట్రెండింగ్‌

Advertisement