వీడియోగేమ్స్ ఆడ‌డం మంచిదేన‌ట‌..!


Sun,September 23, 2018 11:57 AM

అస్త‌మానం వీడియో గేమ్స్ ఎందుకు ఆడుతారు.. అంటూ త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను మంద‌లిస్తుంటారు. అయితే నిజానికి వీడియోగేమ్స్ ఆడ‌డం మంచిదేన‌ట‌. ఆ గేమ్స్‌ను ఆడ‌డం వ‌ల్ల గుండెకు మంచి వ్యాయామం జ‌రుగుతుంద‌ట‌. ఇదే విష‌యం ఓ సైంటిస్టు బృందం చేసిన తాజా ప‌రిశోధ‌న‌ల‌లో తెలిసింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌కు చెందిన భారత సంతతి శాస్త్రవేత్త కవిత రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని బృందం.. వీడియో గేమ్స్‌ ఆడుతుండగా గుండె పనితీరును పరిశీలించగా రక్తసరఫరా బాగా జరిగినట్లు తేలింది. గుండెకు రక్తసరఫరా బాగా జరగటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండి, హృద్రోగాలు రావని పరిశోధకులు తెలిపారు. వీడియో గేమ్స్‌ గుండెకు మంచి వ్యాయామం అని, వాటిని ఆడటం వల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే వీడియోగేమ్స్ ఆడడం వ‌ల్ల ఈ ప్ర‌యోజ‌నం ఉన్న‌ప్ప‌టికీ అదే ప‌నిగా వీడియో గేమ్స్‌ను ఆడితే మాత్రం మానసిక ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని మాత్రం వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

1944

More News

VIRAL NEWS