థైరాయిడ్ ఉన్నవారు ఆలోచించకుండా ఇవి తినొచ్చు

హైదరాబాద్ : ఈ మధ్య పదిమందిలో ఒకరు థైరాయిడ్ వ్యాధితో బాధపడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది. ఉన్నట్టుండి బరువు పెరగడం, నెలసరి సరిగా రాకపోవడం, పెళ్లయి ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టకపోవడం ఇవన్నీ థైరాయిడ్ లక్షణాలు. థైరాయిడ్ హార్మోన్లు సవ్యంగా విడుదలైనప్పుడే శరీరంలో ప్రతి కణం సరిగ్గా పనిచేసి, జీవక్రియ పనితీరు బాగుంటుంది. ఆ హార్మోన్ విడుదలలో ఎప్పుడైతే సమతుల్యం లోపిస్తుందో అప్పుడు సమస్యలు తప్పవు. సాధారణంగా ఇది రెండు రకాలుగా ఇబ్బందికి గురిచేస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరు విపరీతంగా పెరిగినప్పుడు దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. తక్కువగా పనిచేసినప్పుడు హైపో థైరాయిడిజంగా పరిగణిస్తారు. సాధారణంగా చాలామందిలో కనిపించేది హైపోథైరాయిడిజమే.
రెండింటిలో సమస్య ఏదైనా.. థైరాయిడ్‌తో బాధపడుతున్నవారు ఏ మాత్రం సంకోచం లేకుండా తీసుకోదగ్గ ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయట. అవేంటో తెలుసుకుందాం..
1. మునగకాయ
మునగకాయలో అధికంగా లభించే ఐరన్, ప్రొటీన్లు, విటమిన్లు థైరాయిడ్ పేషంట్లకు చాలా మంచి ఆహారం.
2. ఉసిరికాయ
ఉసిరిలో శరీరానికి కావాల్సిన విటమిన్-సి లభిస్తుంది. ఉదయాన్నే లేచిన తర్వాత ఉసిరికాయ రసం తాగడం థైరాయిడ్ తో బాధపడుతున్న వారికి సహాయపడుతుంది.
3. ఎండు కొబ్బరి
థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్న స్త్రీలకు ఎండుకొబ్బరి మంచి ఆహారంగా చెప్పవచ్చు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ థైరాయిడ్ సమస్య తగ్గుతుంది.
4. అరటిపండు
రోజూ అరటిపండు తినడం వల్ల వైద్యుడికి దూరంగా ఉండచ్చని అంటుంటారు. అలాగే దీంట్లో ఉండే క్యాల్షియం థైరాయిడ్ పేషంట్లకు బాగా ఉపయోగపడుతుంది.
5. పెసళ్లు
పెసళ్లలో మనిషి శరీరానికి కావాల్సిన రకరకాల ప్రోటీన్లు లభిస్తాయి. ఇవి త్వరగా అరుగుతాయి. వీటిని ప్రతిరోజు తినడం వల్ల మీ థైరాయిడ్ సమస్య తీవ్రతరం కాకుండా ఉంటుంది.
తాజావార్తలు
- సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నాణ్యమైన సేవలు
- పన్ను వసూలు ముమ్మరం
- త్వరలో అలీకేఫ్ జంక్షన్ సుందరీకరణ
- ఆహ్లాదానికి చిరునామా..
- అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
- నేడే గట్టు మైసమ్మ జాతర
- స్వచ్ఛసర్వేక్షణ్-2021పై అవగాహన ర్యాలీ
- రౌడీ రాజకీయాలు మానుకోండి
- మంథని గ్రౌండ్‌ను అభివృద్ధి చేస్తాం
- బ్యాక్ వాటర్ సమస్యల పరిష్కారానికి కృషి