మెదడులో లోపమే..ఆత్మహత్యకు కారణం!

Mon,September 9, 2019 09:13 AM

ఖైరతాబాద్: ఆత్మహత్యలకు మెదడులో కలిగే లోపమే కారణమని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు, నివారణ, చికిత్స తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ ఇండియన్ సైక్రియాటిక్ సొసైటీ సౌత్ జోన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐఎంఏ ఏయిర్‌పోర్టు ఉమెన్ వింగ్, నిమ్స్ రెసిడెంట్స్ డాక్టర్ అసోసియేషన్, తెలంగాణ డాక్టర్స్ ఫోరం, గాంధీ, ఉస్మానియా, అపోలో మెడికల్ కళాశాలలు, కొలంబస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ అండ్ డెడిక్షన్ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా నుంచి జలవిహార్ వరకు 2కే రన్ నిర్వహించారు.


ఇండియన్ సైక్రియాట్రిక్ సొసైటీ సౌత్ జోనల్ బ్రాంచ్ అధ్యక్షులు ఎ.జగదీశ్, కార్యదర్శి డాక్టర్ నరేశ్ వడ్లమాని, క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, ఐఎంఏ సిటీ బ్రాంచ్ అధ్యక్షులు గురుబచ్చన్ సింగ్, ఎంఎల్‌ఆర్ ఇనిస్టిట్యూట్స్ అధినేత మర్రి లకా్ష్మరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేశ్ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన మెదడులో నుంచి వస్తుందని, అందులో ఉండే ఓ కణం ప్రేరేపితమై క్షణికావేశానికి గురవుతారన్నారు. కౌన్సెలింగ్, మందులు, పలు రకాల చికిత్సల ద్వారా ఆలోచన నుంచి బాధితులను బయటకు తీసుకువచ్చి సాధారణ మనుషుల్లా తయారు చేయవచ్చన్నారు. ఎవరైనా ఒంటిరిగా ఉంటూ, తమలో తాము మానసిక ఆందోళనకు గురైనట్లు గుర్తిస్తే వెంటనే వారిని సైక్రియాటిస్ట్ వద్దకు తీసుకెళితే వారి ప్రాణాలను రక్షించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్ శ్రీనివాస్, తెలంగాణ డాక్టర్స్ ఫోరం అధ్యక్షులు డాక్టర్ అన్వేశ్ తదితరులు పాల్గొన్నారు.

5540
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles