మూత్రం తాగితే బరువు తగ్గుతారట..!


Sun,September 9, 2018 06:22 PM

ఎంత సంపాదించినా ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా చేయగలిగేది. అందుకే ఆరోగ్యం కోసం చాలా మంది రకరకాల పద్ధతులు ఫాలో అవుతుంటారు. కొంతమంది ఆయుర్వేదం, మరి కొందరు హోమియోపతి, ఇంకొందరు అల్లోపతి.. ఇలా వాళ్లకు నచ్చిన పద్ధతులను ఫాలో అవుతుంటారు. అయితే.. ఈ జనరేషన్‌ను ఎక్కువగా వేధించే సమస్యల్లో మొదటిది అతి బరువు.. తర్వాత షుగర్, కీళ్ల నొప్పులు.. ఇలా రకరకాల సమస్యలు వేధిస్తుంటాయి. అయితే.. వీటన్నింటినీ తరిమికొట్టడానికి వాడాల్సినవి వాడితే పర్లేదు కానీ.. కొంతమంది మాత్రం ఏకంగా మూత్రమే తాగారట.

అవును.. మీరు చదివేది నిజమే.. నాజూగ్గా తయారవడానికి చాలా మంది మూత్రాన్నే ప్రిఫర్ చేస్తారట. దాన్ని ప్రాక్టికల్‌గా రుజువు కూడా చేశారట. యూఎస్‌లోని ఇదహో స్టేట్‌కు చెందిన కొంతమంది ఈ పద్ధతిని ప్రమోట్ చేస్తున్నారు. ఇదహోకు చెందిన ఓ వాతావరణ నిపుణుడు ఇలాగే మూత్రం తాగి 13 కిలోలు బరువు తగ్గాడట. తనకు ముఖానికి ఉన్న మొటిమలు కూడా తగ్గిపోయాయట. అతడిని చూసి మరో వ్యక్తి జులియా కూడా మూత్రాన్ని తాగి 12 కిలోలు తగ్గాడట. అతడి ముఖం కూడా తేజోవంతం అయిందట. మొటిమలు పూర్తిగా తగ్గిపోయాయట. బరువు తగ్గడం కోసం మూత్రం తాగడం ఇదే కొత్తేమీ కాదు.. ఇది వందల ఏండ్ల నుంచి ఉన్న ప్రక్రియే అంటూ.. ఇది బరువు తగ్గించడమే కాదు.. మనిషిని మళ్లీ తన యవ్వనంలోకి తీసుకెళ్తుందంటూ కొంతమంది ప్రచారం కూడా చేసేస్తున్నారు.

అయితే.. దీనిపై పరిశోధన ప్రారంభించిన రీసెర్చర్లు.. మూత్రం తాగడం వల్ల నిజంగా బరువు తగ్గుతారనడానికి సరైన ఆధారాలు లేవని.. ఇదంతా జోక్స్ వేసుకోవడానికి తప్పితే నిజంగా మూత్రం తాగితే తమ ఆరోగ్యాన్ని తామే పాడు చేసుకున్నట్టే అని చెబుతున్నారు. అయితే.. కొన్ని హెల్త్ బ్లాగ్స్ మాత్రం ఈ తరహా రెమెడీని యూఎస్‌లో బాగా ప్రమోట్ చేస్తుండటంతో ఈ రెమెడీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీరు మాత్రం ఇది ట్రై చేసేరు.. పోతారు జాగ్రత్త.

15970
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles