‘రోజూ ఓ గ్లాసు బీట్రూట్ రసం తాగండి. మీ శరీర వ్యవస్థలలో వచ్చే సానుకూల మార్పులకు మీరే ఆశ్చర్యపోతారు’ అంటున్నారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఎగ్సిటర్ పరిశోధకులు. బీట్రూట్ జ్యూస్ వల్ల నోట్లో రక్త ప్రసరణ, కండర వ్యవస్థలను చైతన్యపరిచే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని వారు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా పాతికమంది ఆరోగ్యవంతులకు పది రోజులపాటు నిత్యం రెండుసార్లు బీట్రూట్ రసం ఇచ్చి, తర్వాత సమగ్ర వైద్యపరీక్షలు జరిపారు. అప్పుడు, ఆశ్చర్యకరంగా అందరిలోనూ ఐదు పాయింట్ల మేర రక్తపోటు తగ్గింది. మునుపటికంటే ఉత్సాహంగా కనిపించారు. కొంతమేర బరువు కూడా తగ్గారు. పది రోజులకే ఇంత తేడా కనిపిస్తే, దీర్ఘకాలంలో ఇంకెన్ని ప్రయోజనాలు ఉంటాయో, మీరే ఊహించుకోండి!