సోమవారం 28 సెప్టెంబర్ 2020
Health - Sep 08, 2020 , 18:08:34

ఈ ఆకుతో క‌షాయం చేసుకొని తాగితే.. క‌రోనా భ‌య‌మే ఉండ‌దు!

ఈ ఆకుతో క‌షాయం చేసుకొని తాగితే.. క‌రోనా భ‌య‌మే ఉండ‌దు!

నీలవెంబు ఆకు గురించి వినే ఉంటారు. దీనివ‌ల్ల అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలున్నాయి. దీంతో త‌యారు చేసిన క‌షాయం తాగితే ఎలాంటి వ్యాధులు ద‌రిచేర‌కుండా ఉంటాయి. అంతేకాదు క‌రోనా స‌మ‌యంలో రాకూడ‌ని శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను సైతం త‌రిమికొడుతుంది. ఇందులో యాంటీ-బయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటివి పుష్క‌లంగా ఉన్నాయి. సాధార‌ణంగా వ‌ర్షాలు స్టార్ట్ అవ్వ‌గానే అంద‌రికీ జ‌లుబు, ద‌గ్గు మొద‌ల‌వుతుంది. వీటికి చికిత్స‌గా నీల‌వెంబు ఆకుతో త‌యారు చేసిన క‌షాయం తీసుకోవ‌డం ఉత్త‌మం. అస్త‌మాతో బాధ‌ప‌డేవారు ఈ క‌షాయం తాగితే  ఉప‌శ‌మ‌నం లభిస్తుంది. క‌షాయం మాత్ర‌మే కాదు. వ‌ట్టి ఆకుల‌ను ప్ర‌తిరోజూ తిన‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచిన‌వార‌వుతారు.

శ‌రీరంలో వేడి ఎక్కువైన‌ప్పుడు నాలుక మీద వ‌చ్చే అల్స‌ర్లు కూడా క‌రోనాకు దారితీయ‌వచ్చు అంటున్నారు. మ‌రి ఆ అల్స‌ర్ల‌ను రాకుండా చేయాలంటే నీల‌వెంబు ఆకుల‌తో చేసిన క‌షాయం తాగితే స‌రిపోతుంది. అంతేకాదు ఇది గ్యాస్ట్రిక్ అల్స‌ర్ల‌ను కూడా న‌యం చేస్తుంది. ప్ర‌తిరోజూ కాక‌పోయినా అప్పుడ‌ప్పుడు క‌షాయం తాగ‌డం వ‌ల్ల అంటువ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ క‌షాయం క‌రోనా బారిన ప‌డ‌కుండా చేస్తుంది అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. 


logo