శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Apr 04, 2020 , 19:57:27

నేచురల్ రెమెడీస్ తో బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవడం ఎలా..?

నేచురల్ రెమెడీస్ తో బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవడం ఎలా..?

  • హైబ్లడ్ ప్రెజర్ కు చాలా కారణాలున్నాయి. హైబ్లడ్ ప్రెజర్ ఉప్పు ఎక్కువ తినడం, ఆల్కహాల్ తీసుకోవడం, స్ట్రెస్ ఫుల్ లైఫ్ , వ్యాయామం లేకపోపవడం, ఇవన్నీ హైబ్లడ్ ప్రెజర్ కు ఒక విధమైన కారణాలు.  ఊబకాయం వల్ల కూడా బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది.
  • బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవడానికి టాబ్లెట్స్ సూచిస్తుంటారు. అయితే ఇవి ఖరీదైనవి, సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి, ఈ సింథటిక్ మెడికేషన్ తీసుకోవడం కంటే, నేచురల్ గా చౌకైన హోం రెమెడీస్ ఇంట్లో ఉన్న రెమెడీస్ ను ఫాలో అవ్వడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు..
  • వెల్లుల్లి:హైపర్ టెన్షన్ నివారించడంలో వెల్లుల్లి వండర్ ఫుల్ గా పనిచేస్తుంది. వెల్లుల్లి యాంటీ డ్యూరియాటిక్ . అంటే రక్తంలోని సోడియంను రీనల్ సిస్టమ్ కు (కిడ్నీ)కి నెట్టుతుంది. బ్లడ్ ప్రెజర్ తగ్గించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది. వెల్లుల్లి ఆహారాలను ఫ్లేవర్ ను అందివ్వడం మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. సలాడ్స్ లో అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.
  • టమాటాలు: వీటిలో విటమిన్స్ ముఖ్యంగా విటమిన్ ఇ ,లైకోపిన్ వంటి యాంటీ యాక్సిడెంట్స్ హైపర్ టెన్షన్ కు కారణమయ్యే ఫ్యాటీ యాసిడ్స్ ను ధమనుల్లో బిల్డ్ అప్ చేయకుండా నివారిస్తుంది. ఈ సమస్యను నివారించుకోవడం కోసం ఫ్రెష్ గా కట్ చేసిన టమోటోలు లేదా టమోటో జ్యూస్ తీసుకోవాలి.

బీట్ రూట్, రాడిష్:

  • బీట్ రూట్ ,రాడిష్ వంటివి అప్పుడప్పుడు తీసుకోవడం మంచిది. ఇవి ఆరోగ్యానికి సహాయపడే నైట్రేట్స్ ను సప్లై చేస్తుంది. ఇది వాసోడిలేషన్ కు కారణమయ్యే హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. కాబట్టి, వీటిని సలాడ్స్ తో చేర్చి తీసుకోవాలి.
  • సాల్ట్ తగ్గించాలి: ఉప్పు తినడం తగ్గించడం వల్ల హైపర్ టెన్షన్ తగ్గించుకోవచ్చు. ఇది మంచిది కాదు, అయితే ఇలా ఉప్పు తినడం వల్ల దీర్ఘకాలంలో ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ప్రొసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది.
  • వాటర్ :బ్లడర్ ప్రెజర్ ను తగ్గించుకోవాలంటే శరీరం తగిన హైడ్రేషన్ లో ఉండాలి. అందుకు సరిపడా నీళ్ళు తాగాలి. శరీరంలో అధికంగా ఉన్న సోడియం కంటెంట్ ను వాటర్ వాటర్ ద్వారా బయటకు నెట్టివేయవచ్చు.

అరటి పండ్లు :

  • అరటి పండ్లు చాలా చౌకైనవి. ఇవి నేచురల్ గా బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తాయి. అరటి పండ్లలో మినిరల్స్, పొటాషియం అధికంగా ఉంది. ఇవి కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి, బ్లడ్ ప్రెజర్ తగ్గించుకోవాలంటే అరటిపండ్లు రెగ్యులర్ గా తినాలి.


logo