ఊపిరితిత్తులు శుభ్రం కావాలా..? ఇలా చేయండి..!

Tue,December 10, 2019 03:38 PM

నిత్యం ధూమపానం చేసేవారికే కాదు, కాలుష్యంలో తిరిగేవారికి కూడా ఊపిరితిత్తుల వ్యాధులు పొంచి ఉంటాయి. ఊపిరితిత్తులు విష వ్యర్థాలతో నిండిపోతాయి. దీంతో అనేక సమస్యలు వస్తాయి. అయితే కింద తెలిపిన సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!


* ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు వెళ్లిపోతాయి. దీంతో ఊపిరితిత్తులు కూడా శుభ్రమవుతాయి. అయితే నిమ్మరసానికి బదులుగా పైనాపిల్, క్రాన్‌బెర్రీ జ్యూస్‌లను కూడా తాగవచ్చు.

* పరగడుపునే ఒకటి లేదా రెండు టీస్పూన్ల అల్లం రసం సేవించినా ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి.

* ఉదయాన్నే 3 నుంచి 5 పుదీనా ఆకులను అలాగే నమిలి మింగితే ఊపిరితిత్తులకు బలం కలుగుతుంది. అలాగే ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి.

* రోజూ ఉదయాన్నే ప్రాణాయామం చేయడం వల్ల కూడా ఊపిరితిత్తులను శుభ్రంగా మార్చుకోవచ్చు.

* గోరు వెచ్చని నీటిలో 5 నుంచి 10 చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసి అనంతరం వచ్చే ఆవిరిని పీలిస్తే ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.

* ఛాతిపై నిత్యం ఆముదాన్ని మర్దనా చేస్తుంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

8083
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles