శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Aug 22, 2020 , 21:53:45

అరటి పండుపై అపోహలా.. ఇది చదవండి..

అరటి పండుపై అపోహలా.. ఇది చదవండి..

హైదరాబాద్‌: అరటి.. ప్రపంచంలో ఎక్కువగా తినే పండు. అన్ని రకాల పండ్లు కొన్ని సీజన్స్‌లలో మాత్రమే దొరుకుతాయి. కొన్ని పండ్లు సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి. చాలా తక్కువ పండ్లు మాత్రమే ప్రతి రోజు దొరుకుతాయి. అలా దొరికే పండ్లలో మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేది అరటి పండు. అరటి పండు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. వీటి వల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు అందుతాయి. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. త‌క్ష‌ణ శ‌క్తిని ఇవ్వ‌డంలోనూ దీనికి సాటిలేదు. ఇదిలా ఉండగా, చాలా మందిలో అర‌టిపండ్ల‌ను గురించి కొన్ని అపోహ‌లు ఉన్నాయి. దీంతో ఈ పండును పక్కనపెట్టేస్తారు. అలాంటివారు ఇది చదవండి..

అపోహ: మధుమేహతో బాధపడుతున్నవారు అరటిపండు తినొద్దు..

వాస్తవం: షుగ‌ర్ ఉన్న‌వారు కూడా నిర‌భ్యంత‌రంగా అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చు. అయితే తక్కువగా తినాలి. ఆహారం తక్కువగా తీసుకునేవారు అరటిపండ్లను తినవచ్చు. మధుమేహంతో బాధపడేవారు దీన్ని పక్కనపెట్టడానికి ప్రధాన కారణం ఇందులో చక్కెర ఉంటుందని. అయితే ఇందులో ఉండే చక్కెర ఫ్రక్టోజ్‌. ఇది సహజసిద్ధమైనది. కనుక డయాబెటిస్‌ రోగులకు ఇది హాని చేయదు.  

అపోహ:బీపీ ఉన్నవారు అరటిపండ్లు తినొద్దు

వాస్తవం: బీపీ ఉన్నవారు అరటిపండ్లు తింటే హైబీపీ వస్తుందని అనుకుంటారు. కానీ అలాంటి భయం అక్కర్లేదు. అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బీపీని కంట్రోల్‌ చేస్తుంది. అలాగే, అరటిపండ్లను తినడం వల్ల బీపీ ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు తప్పుతుంది.  

అపోహ: అరటిపండు తింటే బరువు పెరుగుతారు..

వాస్తవం: చాలామంది అర‌టి పండ్ల‌ను ఎక్కువ‌గా తింటే బ‌రువు పెరుగుతామ‌ని భయపడుతూ ఉంటారు. అందుకే ఈ పండుకు దూరంగా ఉంటారు. అయితే, ఇందులో పెక్టిన్‌, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి తిన్నవెంటనే కడుపునిండిన ఫీలింగ్‌ కలుగుతుంది. దీంతో పొట్ట కొంత ముందుకు వచ్చినట్లు అనిపిస్తుంది. అంతేకాని అరటిపండ్లను తింటే బరువు పెరుగరు. పొట్ట కూడా రాదు. అర‌టిపండ్ల‌లో కొలెస్ట్రాల్ ఉండ‌దు. కానీ వాటిలో ఉండే ప‌లు ఔష‌ధ గుణాలు మ‌న శ‌రీరంలోని మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో మ‌న‌కు ఉప‌యోగ‌మే త‌ప్ప న‌ష్టం ఉండ‌దు.

అపోహ: బరువుతగ్గాలనుకునేవారు అరటి పండ్లను తినొద్దు..

వాస్తవం: బ‌రువు త‌గ్గాల‌ని అనుకునే వారు కూడా అర‌టి పండ్ల‌ను దూరంపెడతారు. ఎందుకంటే అర‌టి పండ్ల వ‌ల్ల శ‌రీరంలో అద‌న‌పు క్యాల‌రీలు చేరుతాయ‌ని వారు నమ్ముతారు. కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే బ‌రువు తగ్గాలనుకునేవారు ఎక్స‌ర్‌సైజ్ చేసే క్ర‌మంలో అర‌టి పండ్ల‌ను తింటే శ‌రీరానికి ఎక్కువ శ‌క్తి ల‌భిస్తుంది. దీంతో మ‌రికొంత సేపు ఎక్కువ‌గా వ్యాయామం చేయ‌వ‌చ్చు. అది మ‌న‌కు మేలే చేస్తుంది. కానీ న‌ష్టం చేయ‌దు.


p>లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo