రూ.1600కే మింత్రా బ్లింక్ గో ఫిట్‌నెస్ ట్రాకర్


Wed,June 20, 2018 07:57 PM

ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయ సంస్థ మింత్రా వియరబుల్ ప్లాట్‌ఫాం రంగంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఆ సంస్థ బ్లింక్ గో పేరిట ఓ నూతన ఫిట్‌నెస్ ట్రాకర్‌ను ఇవాళ విడుదల చేసింది. రూ.1679 ధరకు ఈ ఫిట్‌నెస్ ట్రాకర్ మింత్రా వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా లభిస్తున్నది.

మింత్రా బ్లింక్ గో ఫిట్‌నెస్ ట్రాకర్‌ను ఆండ్రాయిడ్ 5.1 ఆపైన వెర్షన్, ఐఓఎస్ 10 ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లకు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందుకు గాను ఆయా ప్లాట్‌ఫాంలపై ప్రత్యేకంగా యాప్‌ను కూడా అందిస్తున్నారు. అలాగే ఈ ఫిట్‌నెస్ ట్రాకర్‌లో వాటర్ రెసిస్టెంట్, కలర్డ్ డిస్‌ప్లే, హార్ట్ రేట్ సెన్సార్, కాలర్ ఐడీ, వాట్సాప్, మెసేజ్, మెయిల్ నోటిఫికేషన్స్, సెషన్స్ మోడ్, కస్టమ్ అలారమ్స్, టైమర్, ఫైండ్ మై ఫోన్, సెడెంటరీ రిమైండర్స్, స్టెప్ కౌంటర్, డిస్టాన్స్, క్యాలరీస్, స్లీప్ కౌంటర్స్ తదితర ఫీచర్లు లభిస్తున్నాయి. ఇందులో 100 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. కనుక ఈ ఫిట్‌నెస్ బ్యాండ్‌ను ఒకసారి చార్జింగ్ చేస్తే 3 నుంచి 5 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.

3006

More News

VIRAL NEWS

Featured Articles