పుపుట్టగొడుగులలో పుట్టెడు ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చన్నది పోషకాహార నిపుణుల మాట. పుట్టగొడుగుల్లో ఉండే విటమిన్ బీ12, యాంటీఆక్సిడెంట్లతో కుంగుబాటు సమస్యను దూరం చేసుకోవచ్చు.
డిప్రెషన్‌ను నివారించడంతో పాటు ఈ సూపర్ ఫుడ్‌ను తరచూ తీసుకోవడం ద్వారా మెరుగైన రోగ నిరోధక వ్యవస్ధను పెంపొందించుకోవచ్చు. కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పుట్టగొడుగులను తీసుకోవడం శరీరానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే బయోయాక్టివ్స్, బీటా గ్లూకాన్లతో పాటు వీటి ఔషధ గుణాలు శరీరం కోలుకునే ప్రక్రియను వేగవంతం చేయడం, ఫ్లూ ఇన్ఫెక్షన్ల ముప్పును తగ్గించడం చేస్తాయి.
వీటిలో అధిక ఫైబర్, ప్రిబయోటిక్స్ వల్ల పుట్టగొడుగులు శరీరంలో మంచి, చెడు బ్యాక్టీరియాల మధ్య సరైన బ్యాలెన్స్ ఉండేలా దోహదపడటంతో జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. పుట్టగొడుగులతో మనకు రోజూ కావాల్సిన డీ విటమిన్‌ను చాలా వరకూ పొందవచ్చు. మనకూ రోజూ అవసరమయ్యే విటమిన్ డీ పుట్టగొడుగుల్లో పది నుంచి యాభై శాతం వరకూ లభిస్తుందని ఆస్ట్రేలియాలో ఇటీవల చేపట్టిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.