శుక్రవారం 23 అక్టోబర్ 2020
Health - Sep 30, 2020 , 17:26:49

నిద్ర‌లో శ‌రీర కండ‌రాలు ప‌ట్టుకుంటున్నాయా? ఇలా చేస్తే త‌క్ష‌ణ‌మే..!

నిద్ర‌లో శ‌రీర కండ‌రాలు ప‌ట్టుకుంటున్నాయా? ఇలా చేస్తే త‌క్ష‌ణ‌మే..!

కొంత‌‌మందికి నిద్ర‌లో మెడ ప‌ట్టేయ‌డం, న‌డుము, కాళ్లు, చేతులు ప‌ట్టేసిన‌ట్లు ఉంటుంది. దీంతో ఆ రోజంతా ఎటూ క‌ద‌ల్లేని పరిస్థితి. ఇలా కండ‌రాలు ప‌ట్టేయ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం తెలియ‌క నొప్పిని భ‌రిస్తుంటారు. శ‌రీరంలో పొటాషియం త‌క్కువైతే ఇలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. కాబ‌ట్టి పొటాషియం ఉన్న ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాలి. అతి త‌క్కువ ధ‌ర‌కు దొరికే అర‌టిపండ్ల‌లో పొటాషియం పుష్క‌లంగా దొరుకుతుంది. దీని నుంచి విముక్తి పొందాలంటే వెంట‌నే ఇలా చేస్తే స‌రిపోతుంది.

లేదంటే కండ‌రాలు ప‌ట్టేసిన ప్ర‌దేశంలో ఐస్‌క్యూబ్స్‌తో కాసేపు మ‌సాజ్ చేయాలి. ఇలా చేసినా ఫ‌లితం ఉంటుంది. ప్ర‌తిఒక్క‌రి ఇంట్లో కొబ్బ‌రినూనె త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. ఈ నూనెలో కొన్ని ల‌వంగాలు వేసి వేడి చేయాలి. చ‌ల్లార‌క ముందే ఈ మిశ్ర‌మాన్ని నొప్పిగా ఉన్న ప్ర‌దేశంలో అప్లై చేయాలి. ఇలా చేస్తే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డొ‌చ్చు. వీటిలో ఏ ఒక‌టి పాటించినా స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. స‌మ‌స్య వ‌చ్చాక ప‌రిష్కారం కోసం వెత‌క‌డం క‌న్నా, ముందే పొటాషియం దొరికే ఆహారం తీసుకుంటే స‌రిపోతుందంటున్నారు వైద్యులు. 


logo