మెంతుల్లో ఉండే పోషకాలతో ఎంతో మేలు


Tue,September 11, 2018 08:25 PM

వానకాలంలో ఎక్కువగా తడుస్తూ ఉంటారు. తేమతో ఉండడం వల్ల జుట్టు చిక్కు, చుండ్రు, జుట్టు పొడి బారడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఎన్నో రకాల ఉత్పత్తులను వాడినా జుట్టు నాణ్యత తిరిగిరాదు. మెంతుల్లో ఉండే పోషకాలు వీటికి భిన్నంగా పనిచేసి జుట్టు కాంతివంతంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

* మెంతుల్లో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఏ, కే, సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా దొరుకుతాయి. అంతేకాకుండా ఎన్నో జుట్టు సమస్యలకు మెంతులు చక్కని పరిష్కారం కూడా. మెంతులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
* మెంతులను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని రుబ్బి మెత్తని పేస్టులా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకొని మర్దన చేయాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు పెరగడంతో పాటు కాంతివంతంగా మారుతుంది.
* మెంతులను రాత్రంతా చల్లని నీటిలో నానబెట్టాలి. మరుసటి ఉదయం మెంతులను బాగా రుబ్బాలి. అందులో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలుపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు ఐప్లె చేయాలి. 30 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రును అదుపులో ఉంచి జుట్టు రాలడం తగ్గుతుంది.
* మెంతుల పేస్టులో కొంచెం కొబ్బరిపాలను కలుపాలి. ఈ మిశ్రమాన్ని మునివేళ్లతో జుట్టు, మాడుకు బాగా పట్టించాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో తలస్నానం చేయాలి.
* కొన్నిసార్లు మెంతులు రుబ్బడానికి వీలు లేనప్పుడు మార్కెట్లో దొరికే మెంతి పొడిని ఉపయోగించి పైన చెప్పిన మాస్కులను తయారుచేయవచ్చు.

12718
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles