ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Health - Aug 05, 2020 , 18:32:08

ఈ కాలంలో ఈ కూరగాయలు తింటే బెటర్‌..

ఈ కాలంలో ఈ కూరగాయలు తింటే బెటర్‌..

న్యూ ఢిల్లీ: వర్షాకాలం తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో గాలి, నీరు, దోమల ద్వారా అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. అందుకే బయట ఏదీ తినడం, తాగకపోవడమే మంచింది. ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినాలని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో కలుషితమైన ఆహారం వల్ల కడుపులో ఇన్పెక్షన్లు వస్తాయి. విరేచనాలు, వాంతులు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే, ప్రస్తుతం కరోనా వైరస్‌ కూడా దీనికి తోడైంది. దీంతో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాల్సిన ఆవశ్యకత పెరిగింది. కాగా, కొన్ని కూరగాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఐదు రకాల కూరగాయలను తప్పక తినాలని సూచిస్తున్నారు.  

1.ఆన్గెపుకాయ లేదా సొరకాయ..

ఈ ఆన్గెపుకాయ లేదా సొరకాయ అత్యంత పోషకాలతోకూడిన ఆరోగ్యకరమైన, తేలికపాటి కూరగాయల్లో ఒకటి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో నీటిశాతం సమృద్ధిగా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు కూడా తగ్గవచ్చు. 

2.కాకరకాయ..

కాకరకాయలో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి, పొటాషియం, కాల్షియంలాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే, ఫైబర్, బీటా కెరోటిన్‌ను కలిగి ఉంటుంది. ఎముకల బలాన్ని మెరుగుపరచడంలో, వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. దీన్ని క్రమంతప్పకుండా తీసుకుంటే శరీరంలోని విషపూరిత రసాయనాలు తొలగిపోతాయి.

3.గోరుచిక్కుడు..

గోరు చిక్కుడులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా ఉండేలా సహాయపడుతుంది. వర్షాకాలంలో వచ్చే కడుపు ఇన్ఫెక్షన్లనుంచి కాపాడుతుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే, ఇందులో అధికమొత్తంలో ఫోలిక్‌యాసిడ్‌ ఉంటుంది.. కాబట్టి గర్భిణులకు ఇది మంచి ఆహారం. 

4.దోసకాయ..

దోసకాయ శరీరాన్ని డిటాక్స్‌ (విషరసాయనాల తొలగింపు) చేస్తుంది. పగటిపూట దీన్ని తీసుకుంటే రిఫ్రెష్‌ చేస్తుంది. దీన్ని తింటే కడుపునిండిన భావన కలిగి తొందరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలనుకునేవారు క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. ఎండాకాలంతోపాటు వర్షాకాలంలోనూ ఇది శరీరానికి మంచి చేస్తుంది.  

5.బెండకాయ..

బెండకాయ ఇది చాలామందికి ఇష్టమైన కూరగాయ. ఇందులో పీచుపదార్థాలతోపాటు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo