పాలు, నెయ్యి మిశ్రమంతో మలబద్దకం దూరం..!


Wed,September 19, 2018 02:57 PM

మన దేశంలో 22 శాతం మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మలం విసర్జించడంలో తీవ్రమైన ఇబ్బంది కలిగితే దాన్నే మలబద్దకం అంటారు. మన దేశంలో చాలా మంది ఈ సమస్యతో నిత్యం సతమతమవుతున్నారు. ఆయుర్వేద ప్రకారం మలబద్దకం వాత సంబంధ వ్యాధి. ఇది మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ (పీచు పదార్థం) సరిగ్గా లేకపోవడం వల్ల వస్తుంది. అలాగే రోజూ తగినంత నీటిని తీసుకోకపోయినా, వ్యాయామం చేయకపోయినా, థైరాయిడ్, డయాబెటిస్ వంటి సమస్యలున్నా మలబద్దకం వస్తుంటుంది.

మలబద్దకానికి ఆయుర్వేదం చక్కని పరిష్కారాన్ని చూపుతున్నది. రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించేముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో 1 లేదా 2 టీస్పూన్ల నెయ్యి కలుపుకుని తీసుకుంటే శరీరంలో వాత, పిత్త సంబంధ సమస్యలు పోతాయి. దీంతో మలబద్దకం తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఈ మిశ్రమాన్ని తీసుకుంటే కఫ సంబంధ వ్యాధులు పెరుగుతాయి కనుక కఫ సమస్యలతో బాధపడేవారు వైద్యుని సలహా మేరకు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం ఉత్తమమని ఆయుర్వేదం చెబుతోంది. అయితే కొందరిలో పాలు సుఖ విరేచనాన్ని కలిగించే పదార్థంగా పనిచేస్తే కొందరికి పాలు తాగితే మలబద్దకం ఏర్పడుతుంది. ఈ సమస్యను కూడా ఒకసారి పరిశీలించుకుని పైన చెప్పిన విధంగా పాలు, నెయ్యి మిశ్రమాన్ని తాగితే మలబద్దకం నుంచి బయట పడవచ్చు.

2718

More News

VIRAL NEWS