శనివారం 04 ఏప్రిల్ 2020
Health - Mar 13, 2020 , 15:32:02

చిరుధాన్యాలు.. ఆరోగ్య ప్రయోజనాలు

చిరుధాన్యాలు.. ఆరోగ్య ప్రయోజనాలు

ధాన్యం మన ప్రధాన ఆహారం. బియ్యం కంటే కూడా చిరుధాన్యాలు మరింత ఎక్కువ మేలు చేస్తాయి. శక్తినివ్వడంలో గాని, అవసరమైన పోషకాలను అందించడంలో గాని ఇవి ముందుంటాయి. అందుకే జొన్నలు, రాగుల వంటివి ప్రధాన ఆహారంలో భాగం చేసుకుంటే అనేక రకాలుగా ఆరోగ్యం సొంతమవుతుందంటున్నారు శాస్త్రజ్ఞులు. 

చిరుధాన్యాలు యాంటి అసిడిక్‌ లక్షణాన్ని కలిగివుంటాయి. అందువల్ల వీటిని తీసుకుంటే అసిడిటీ, గ్యాస్‌ సమస్యల బారి నుంచి బయటపడవచ్చు. ఇవి శరీరాన్ని డీటాక్సిఫై చేస్తాయి. అంటే శరీరంలో పేరుకున్న విష పదార్థాలను తొలగిస్తాయి. చిరుధాన్యాల్లో ఉండే నియాసిన్‌ (బి3 విటమిన్‌) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. 

చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకునేవాళ్లలో రొమ్ము క్యాన్సర్‌ అవకాశాలు తక్కువ. అధిక రక్తపోటు, టైప్‌ 2 డయాబెటిస్‌ను నివారిస్తాయి. నియంత్రిస్తాయి కూడా. ఆస్తమా లాంటి శ్వాస సమస్యల చికిత్సలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కిడ్నీ, కాలేయ వ్యాధులు రాకుండా నివారించవచ్చు. వాటి పనితీరు మెరుగుపరుస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.  గ్యాస్ట్రిక్‌ అల్సర్లు, పెద్దపేగు క్యాన్సర్‌ నివారణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. చిరుధాన్యాలు తీసుకుంటే మలబద్దకం, కడుపుబ్బరం లాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. 


logo