ఆదివారం 07 జూన్ 2020
Health - Mar 31, 2020 , 16:33:03

నడివయసువారికి ముప్పు తక్కువేమీ కాదు

నడివయసువారికి ముప్పు తక్కువేమీ కాదు

హైదరాబాద్: కరోనా అనగానే 60-70 ఏళ్ల పైబడినవారికే ముప్పు ఎక్కువ అనే బావన చాలామందిలో ఉన్నది. కానీ మధ్యవయస్కులకూ ముప్పు తక్కువేమీ ఉండదని తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.  చైనా కరోనా మరణాలపై బ్రిటిష్ శాస్త్రవేత్తలు అధ్యయనం జరిపారు. ఈ అధ్యయనం ఫలితాలను లాన్సెట్ ఇన్పెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించారు. 80 పైచిలుకు వయసు గలవారిలో ఐదోవంతు మంది అంటే 20 శాతం మందికి హాస్పిటల్ లో చేర్చడం తప్పని సరి అయింది. 30 ఏళ్ల లోపువారైతే ఆస్పత్రిలో చేర్చడం అనేది 1 శాతం మందికి తప్పనిసరి అయ్యింది. అయితే 50 లోపు వయసు వారికంటే 50లలో ఉన్నవారికి హాస్పిటలైజేషన్ తప్పని సరయ్యే అవకాీశాలు ఎక్కువ. వారి హాస్పిటలైజేషన్ రేటు 8.2 శాతంగా ఉన్నది. అంతేకాకుండా మరణాల రేటు కూడా ఎక్కువే ఉన్నది. 40-49 వయసువారిలో 4.3 శాతం హాస్పిటలైజేషన్ అవసరమైంది. 20 


లోపు వయసువారిలో కేవలం 1 శాతం మాత్రమే హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. చైనాలో అంతిమంగా నిర్ధారిత కరోనా రోగుల్లో మృతుల శాతం 


1.38 గా తేలింది. అయితే అంతంతమాత్రం లక్షణాలతో తగ్గిపోయినవారిని లెక్కలోకి తీసుకుంటే మరణాల శాతం 0.66 శాతానికి తగ్గుతుంది. 


ఇదివరకటి బర్డ్ ఫ్లూతో మహమ్మారితో పోలిస్తే ఈ మరణాల రేటు చాలాచాలా తక్కువ. సోమవారం నాటికి ప్రపంచంలో కరోనా సోకినవారి సంఖ్య 


7,57,940గా నమోదైంది. అందులో మృతుల సంఖ్య 36,374. అంటే మత్తం అన్ని నిర్ధారిత కరోనా కేసుల్లో 4.8 శాతం మరణించారన్నమాట. కానీ 


నిజంగా ఎందరికి సోకింది, ఎందరు కోలుకున్నారు అనేది అంచనా వేయడం అంత సులభం కాదని నిపుణులు అంటున్నారు. అంటే అసలైన మరణాల 


రేటు తక్కువగానే ఉంటుందని భావించవచ్చు. ఈ అధ్యయనం తేల్చిన లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 50-80 శాతం మందికి కరోనా సోకాలి. కానీ 


వ్యాధి వ్యాప్తి అనేది మనుషుల ప్రవర్తనపై, మరెన్నో ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.  పదేపదే చేతులు కడుక్కోవడం, మనుషుల నుంచి దూరం పాటించడం వంటివి తప్పక ప్రభావం చూపుతాయి.


logo