జుట్టు పెరుగుదలకు మేలు చేసే మెంతులు..


Sun,September 16, 2018 10:49 PM

మెంతులు జుట్టు పెరుగుదలలో ఎంతో మేలు చేస్తాయి. మెంతుల్లో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఎ, కె, సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలం. మెంతులతో చేసే ప్యాక్‌లేంటో చదువండి..

* మెంతులను రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే పేస్ట్ చేయాలి. దీన్ని జుట్టుకు రాసి 20 నిమిషాలు అలాగే వదిలేసి తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల జుట్టు పెరుగుదల బాగుంటుంది.
* మెంతులను నానబెట్టి పేస్ట్ చేసి దాంట్లో నిమ్మరసం కలుపుకోవాలి. జుట్టుకు రాసి మర్దన చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.
* కొబ్బరి పాలల్లో మెంతుల పొడి వేసి తలకు రాయాలి. ఆరేదాకా..ఆగి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఊడడం ఆగిపోవడమే గాక ఒత్తుగా పెరుగుతుంది కూడా.

6573
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles