మాచా టీతో డిప్రెషన్ దూరం..!


Tue,July 16, 2019 12:44 PM

నిత్యం తీవ్రమైన ఒత్తిడితో సతమతమవుతున్నారా ? మీకు ఒత్తిడి కలిగేందుకు అనేక కారణాలు ఉండవచ్చు. కానీ జపనీయులు తాగే మాచా టీ తాగితే ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యల నుంచి బయట పడవచ్చని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్స్ అనే కథనంలో సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచా పౌడర్ లేదా మాచా ఎక్స్‌ట్రాక్ట్‌లను వాడి ఎలుకలపై చేసిన ప్రయోగాలు సఫలమయ్యాయి. ఈ క్రమంలో ఆందోళనగా, కంగారుగా కనిపించిన ఎలుకలు మాచా టీ పౌడర్‌తో ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాయని సైంటిస్టులు గుర్తించారు.

పరిశోధకులు చెబుతున్న ప్రకారం.. మాచా టీని తాగడం వల్ల ఆ పొడిలో ఉండే ఔషధ కారకాలు మన శరీరంలో డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లను యాక్టివేట్ చేస్తాయట. దీంతో మనస్సు రిలాక్స్ అవుతుంది. ప్రశాంతంగా మారుతారు. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఇతర అన్ని మానసిక సమస్యల నుంచి బయట పడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక ఈ సమస్యల నుంచి బయట పడాలంటే నిత్యం మాచా టీని తాగాలని వారు సూచిస్తున్నారు.

2374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles