మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Health - Apr 11, 2020 , 14:43:03

ఫిట్‌గా ఉండాలనుందా? అయితే భాంగ్రా డాన్సు చేయండి

ఫిట్‌గా ఉండాలనుందా? అయితే భాంగ్రా డాన్సు చేయండి

భాంగ్రా డాన్స్‌.. ఎంజాయ్‌కి ఎంజాయ్‌.. ఫిట్‌నెస్‌కి ఫిట్‌నెస్‌ అంటున్నారు నిపుణులు. అందుకే ఈ మధ్యకాలంలో యూత్‌ ఈ డాన్స్‌పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. భాంగ్రా  ఉత్తరాది నాట్యం . అయితే  భాంగ్రాని బరువు తగ్గ‌డానికి ఫిటినెస్‌ నిపుణులు అందుబాటులోకి తెచ్చారు. భాంగ్రా చాలా మందికి ఇష్టమైన డాన్సు. పాటలు మరియు చలన చిత్రాలలో విస్తృతంగా చిత్రీకరించిన కారణంగా, భాంగ్రా కేవలం పంజాబీలకు మాత్రమే పరిమితం కాలేదు. దాదాపు ప్రతి ఒక్కరూ భాంగ్రాను ఇష్టపడుతారు.  

అధిక బ‌రువు అంద‌రినీ ప‌ట్టి పీడిస్తున్న సమస్య. దీన్ని కంట్రోల్ చేయ‌డానికి ప్ర‌తిరోజూ వ్యాయామం, యోగాలు చేస్తున్నారు. రోజూ ఇలా చేయ‌ల‌న్నా బోర్ కొడుతుంది. అందుక‌నే ఈ డాన్సులవైపు మొగ్గుచూపుతున్నారు యువత.  డ్యాన్స్‌లో కూడా మ‌సాలా కావాల‌నుకుంటున్న‌వారికి భాంగ్రా డ్యాన్స్ ప్ర‌త్యేకం. ఈ డ్యాన్స్ ఎలా చేయాలి. దీంతో ప్ర‌యోజ‌నం ఏంటో చాలామందికి తెలియ‌దు. 

భాంగ్రా డ్యాన్స్ ఉప‌యోగాలు :

1.  భంగ్రా డాన్సును చేయడం వల్ల  బరువు కూడా తగ్గడమే కాదు మనిషి ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపవుతుందట.

2. మసాలా భాంగ్రా వల్ల ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. ఈ నృత్యాన్ని యుఎస్ నివాసి ఫిట్నెస్ నిపుణుడు సరిన్ జైన్ రూపొందించారు. 

3. ఇది సాధారణంగా 45-60 నిమిషాలు ఉంటుంది. ఈ కదలికలు బరువు తగ్గడానికి మాత్రమే కాదు శరీరానికి మంచి ఆకృతి తీసుకురావ‌డానికి కూడా సహాయపడతాయి. ఎవరైనా దీన్ని నేర్చుకోవచ్చు 

4. ఇది  ప్రత్యేక సంగీతాన్ని కలిగి ఉంటుంది. కొంతమంది ప్రముఖ సంగీత కళాకారుల సహకారంతో రూపొందించారు.

5. సరైన పద్ధతిలో చేస్తే, మసాలా భాంగ్రా సెషన్‌లో దాదాపు 500 కేలరీలు బర్న్ చేయవచ్చు. దీన్ని చేసిన వ్యక్తులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా 25 కిలోల వరకు తగ్గినట్లు స‌మాచారం. 

6. కేలరీలను బర్న్ చేయడానికి, గుండె పనితీరును పెంచడానికి భాంగ్రా డ్యాన్స్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

7. భాంగ్రా నృత్యం ద్వారా శరీరం మొత్తానికి కదలిక ఉంటుంది. వీలైనంత ఎక్కువసేపు చేస్తే.. కొవ్వు కూడా కరుగుతుంది. ఈ నృత్యంలో కాళ్లు రెండూ వెనక్కి మడిచి చేతులు రెండూ విశాలంగా చాపి పైకి ఎగరేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల శరీరం మొత్తానికి రక్తప్రసరణ అందుతుంది. 

8. అయితే దీన్ని అందరూ చేయడానికి లేదు. బీపీ ఉన్నవారూ, ఇతరత్రా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఇది చేయకపోవడమే మంచిది. ఈ డాన్సు నేర్చుకోవాలనుకునేవారు దానికి సంబంధించిన నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకుంటే మంచిది. 

9. ఈ డాన్సులో ఎక్కువగా కాళ్లు, చేతులు కదిలించాల్సి ఉంటుంది. ఇది కాళ్లూ, చేతులకు వ్యాయామాన్ని అందించి, శరీరం స్ట్రెచ్‌ అయ్యేలా చేస్తుంది. ఈ మొత్తం వ్యాయామాలు శరీరం మొత్తానికి రక్తప్రసరణ అందేటుట్టు చేస్తాయి. 


logo