బుధవారం 28 అక్టోబర్ 2020
Health - Sep 23, 2020 , 17:32:23

మెంతులతో ఎంతో మేలు..!

మెంతులతో ఎంతో మేలు..!

హైద‌రాబాద్‌: ‌మెంతులు వంట‌ల్లో సువాస‌న కోసం మాత్ర‌మే కాదు, ఒంట్లో అనారోగ్యాన్ని పార‌దోల‌డానికి కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతాయి. మెంతులు వివిధ రూపాల్లో తీసుకోవ‌డం ద్వారా మ‌న‌కు ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలున్నాయి. అవేంటో చూద్దామా మ‌రి..

  • మెంతులు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తూ అజీర్తి, క‌డుపుబ్బ‌రాన్ని త‌గ్గిస్తాయి. కాబ‌ట్టి మ‌ధుమేహం ఉన్న‌వాళ్లు నిత్యం మెంతులు తీసుకోవ‌డం ఉత్త‌మం.
  • మెంతుల్లో ఉండే ఫైబ‌ర్ క‌డుపు నిండిన భావ‌న క‌లిగిస్తుంది. దాంతో మ‌నం మోతాదుకు మించిన ఆహారం తీసుకోకుండా అడ్డుకుంటుంది. దానివ‌ల్ల ఒంట్లో కొవ్వు క‌రుగుతుంది. కాబ‌ట్టి స్థూల‌కాయులు మెంతులు నిత్యం తీసుకోవాలి. 
  • రాత్రిపూట ఒక చెంచా మెంతి గింజ‌ల‌ను నీటిలో నాన‌బెట్టి ఉద‌యం లేవ‌గానే ప‌రిగ‌డుపున ఆ నీళ్ల‌ను తాగాలి. దీంతో అజీర్తి స‌మ‌స్య తొల‌గిపోతుంది. 
  • మెంతి గింజ‌ల‌ను పెనం మీద వేయించి, మెత్త‌గా దంచి పెట్టుకోవాలి. రోజూ ఉద‌యాన్నే ఆ పొడిని వేడి నీటిలో క‌లుపుకుని తాగితే ఎన్నో ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొరుకుతుంది. ఈ పొడిని కూర‌ల్లో కూడా వాడుకోవ‌చ్చు. 
  • ఒక చెంచా మెంతుల‌ను రోజూ ఉద‌యం, సాయంత్రం తీసుకోవ‌డంవ‌ల్ల కూడా జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. విరేచ‌నాలు త‌గ్గ‌డానికి కూడా మెంతులు తోడ్ప‌డుతాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo