శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Jun 16, 2020 , 18:24:53

అల్లంతో ఎన్నో ప్రయోజనాలు

అల్లంతో ఎన్నో ప్రయోజనాలు

అల్లం అరోగ్యానికి ఎంతో మంచిది. అయినా కొందరు తినేందుకు ఇష్టపడరు. కానీ దీని ప్రయోజనాలు తెలిస్తే తప్పకుండా రోజువారీ డైట్‌లో చేర్చుకుంటారు. అల్లం తీనడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాళ్ల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్నే అల్లం టీ తాగితే అనారోగ్యం దరి చేరదు. లేదా పచ్చి అల్లం నమిలినా.. తేనెలో కలిపి తిన్న మంచిదే. 

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి రోజు ఉదయం అల్లం తీసుకుంటే అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చాలా మంది బరువు తగ్గడం కోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. అల్లం  బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడుతోంది. ఆకలిని తగ్గిస్తుంది. జలుబు, దగ్గుకు అల్లం మంచి ఔషదంలా పనిచేస్తోంది. గొంతు నొప్పి నుంచి త్వరగా కోలుకోవడాని ఎంతో సహాయపడుతోంది. మధుమేహం ఉన్న వాళ్లు తప్పకుండా అల్లం తీసుకోవాలి. ఈలా చేయడం వల్ల శరీరంలోని చక్కెర శాతం తగ్గుతోంది.


logo