గురువారం 28 జనవరి 2021
Health - Dec 03, 2020 , 18:38:47

బియ్యం కడిగిన నీళ్లతో బోలెడు ప్రయోజనాలు

బియ్యం కడిగిన నీళ్లతో బోలెడు ప్రయోజనాలు

హైద‌రాబాద్ : మనం రోజు అన్నం వండే ముందు బియ్యం కడిగి ఆ నీళ్లను పార‌బోస్తుంటాం. అలాగే అన్నం వండుతున్నప్పుడు గంజి వంపి దాన్ని కూడా పార‌బోస్తుంటాం. అయితే వీటిని పడేయటం మన అమాయకత్వం అని అంటున్నారు ఆహార నిపుణులు. నిజానికి వీటిలో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయట. అవి ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయట. మనం పూర్వీకులు ప్రతిరోజు బియ్యం కడిగిన నీటిని చెట్లకు పోస్తూ గంజి వంపుకుని తాగేవారన్న విషయం తెలిసిందే. అయితే పాత అలవాట్లను మళ్లీ మొదలు పెట్టాల్సిన సమయం రానే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇప్పుడు గంజి తాగుతున్నారు. దీంతోపాటు బియ్యం కడిగిన నీటిలో ఇంకొన్ని నీళ్లను కలిపి రెండు నుంచి ఆరుగంటల పాటు వాటిని అలాగే ఉంచి తర్వాత తాగడం వల్ల ప‌లు ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో చూద్దాం..

* రైస్ వాటర్‌లో చాలా రాకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. వీటిలో ఉండే ఇనోసిటోల్ అనే కంపౌండ్ కణాల ఎదుగుదలకు సహాయపడుతుంది.

* బియ్యం కడిగిన నీటిని ఎనర్జీ డ్రింక్ లాగా కూడా తాగొచ్చట.

* వయసు ప్ర‌భావం తగ్గించడంతో పాటు రక్తప్రసరణ పెంచేందుకు బియ్య కడిగిన నీరు పనిచేస్తాయి.

* రైస్ వాటర్‌లో యాంటీ ఆక్సిడెంట్, మాయిశ్చరైజింగ్, అల్ట్రా‌వైలెట్ రేస్ లాంటివి చర్మానికి, జుట్టుకు మంచి ఔషధంలా పనిచేస్తాయి. వీటితో మొహం కడుక్కోవడం, తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు క‌లుగుతాయి. 

* ఇవి శరీరానికి మసాజ్ చేసుకునేందుకు కూడా బాగా ఉపయెగపడతాయట. నొప్పి, మంట లాంటివాటిని తగ్గిస్తాయి.

*సహజంగా శరీరానికి చలువ చేసే గుణం కలిగి ఉన్న రైస్ వాటర్ మూత్రవిసర్జన సమయంలో వచ్చే మంట, డయేరియా, నెలసరి సమస్యలు లాంటివి రాకుండా కాపాడుతుందట.

* దీంతో పాటు అరచేతులు, అరికాళ్లలో వచ్చే మంటను తగ్గించేందుకు బియ్యం కడిగిన నీరు తగ్గిస్తుంది.


logo