మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Health - Sep 10, 2020 , 22:40:54

బెల్లంతో బోలెడు ప్రయోజనాలు..

బెల్లంతో బోలెడు ప్రయోజనాలు..

హైదరాబాద్‌: బెల్లం దీనిని ఇంగ్లిష్‌లో జాగరీ అని పిలుస్తారు. ఇది ప్రతి కిరాణా షాపులోనూ, స్టోర్స్‌లోనూ లభిస్తుంది. ధర కూడా తక్కువే. తియ్యగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇష్టపడని వారుండరు. అయితే, దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. తరచూ బెల్లం తీసుకోవడం అలవాటుగా చేసుకుంటే అనారోగ్యంబారిన పడకుండా ఉంటామని చెబుతున్నారు. స్వీట్లు, టీలలో చక్కెరకు బదులు బెల్లం వాడితే తీపికి తీపి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అని అంటున్నారు. బెల్లం ప్రయోజనాలేంటో తెలుసుకోండి. 

  • దీన్ని భోజనం తర్వాత తీసుకుంటే ఎసిడిటీ తగ్గుతుంది.
  • జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
  • ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్నవారికి ఇది మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది.
  • ఇది రక్తాన్నిశుద్ధి చేస్తుంది. 
  • మెటాబాలిజం పెంచుతుంది. 
  • గ్యాస్ ప్రాబ్లంను దూరం చేస్తుంది. ఇందుకోసం పాలల్లో బెల్లం వేసుకొని తాగాలని నిపుణులు చెబుతున్నారు.
  • మొటిమలను తగ్గించి, చర్మ నిగారింపునకు సహకరిస్తుంది. 
  • నీరసంగా ఉన్నవారు బెల్లం తింటే వెంటనే శక్తిని పొందుతారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్లోడ్ చేసు­కోండి.


logo