శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Mar 24, 2020 , 12:12:45

ఈ లక్షణం ఉంటే.. కరోనా సోకినట్టే?

ఈ లక్షణం ఉంటే.. కరోనా సోకినట్టే?

పారిస్‌: కరోనా సోకిన వారికి జలుబు, దగ్గుతోపాటు ఇతర లక్షణాలు కూడా ఉన్నట్లు తమ పరిశోధనలో గుర్తించినట్లు ఫ్రెంచ్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. ఎవరైనా ఉన్నట్టుండి వాసన గుర్తించే స్వభావాన్ని కోల్పోయినట్టయితే కరోనా సోకినట్లు అనుమానించవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ లక్షణం కనిపిస్తున్నదని ఫ్రెంచ్‌ శాస్త్రవేత్తలతోపాటు బ్రిటన్‌ వైద్యులు పేర్కొన్నారు. కరోనా సోకిన వారిలో కొంతమంది రుచి స్వభావాన్నీ కోల్పోయినట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో వాసన, రుచి కోల్పోయిన లక్షణాలను కరోనా వ్యాధి లక్షణాల జాబితాలో చేర్చారని యూకేలోని ఈఎన్‌టీ నిఫుణులు ఆ దేశ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఒక్క లక్షణాన్ని నిర్ధారించడం వల్ల కరోనా సోకిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. 



logo