శుక్రవారం 05 మార్చి 2021
Health - Feb 23, 2021 , 17:06:03

తాజా అథ్యయనం : వారిలో గుండెజబ్బులు, స్ట్రోక్‌ ముప్పు అధికం!

తాజా అథ్యయనం : వారిలో గుండెజబ్బులు, స్ట్రోక్‌ ముప్పు అధికం!

న్యూఢిల్లీ : వాయుకాలుష్యం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకారిగా మారిన క్రమంలో తాజా పరిశోధన ప్రపంచ జనాభాను కలవరపెడుతోంది. కాలుష్యం స్ధాయి తక్కువగా ఉన్నా దీర్ఘకాలం ఎక్స్‌పోజ్‌ అయితే అది ప్రాణాంతకంగా పరిణమిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె, ఊపరితిత్తుల వైఫల్యానికి ఇది దారితీస్తుందని తాజా సర్వే హెచ్చరించింది. 2000 నుంచి 2016 వరకూ 6.3 కోట్ల మంది వైద్య రికార్డులను పరిశీలించి తాజా సర్వే పలు అంశాలను తెరపైకి తెచ్చింది.

పరిమిత స్ధాయి కాలుష్యానికి అయినా దీర్ఘకాలం ఎక్స్‌పోజ్‌ అయితే న్యుమోనియా, హార్ట్‌ ఎటాక్‌, స్ట్రోక్‌ వంటి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందని ఈ పరిశోధన హెచ్చరించింది. వయోధికుల్లో ఈ రిస్క్‌ మరింత అధికమని జర్నల్‌ సర్క్యులేషన్‌లో ప్రచురితమైన అథ్యయనం స్పష్టం చేసింది. గాలిలో పర్టిక్యులేట్‌ మ్యాటర్‌, నైట్రోజన్‌ డయాక్సైడ్‌, ఓజోన్‌ వంటి పలు అంశాల ఆధారంగా పరిశోధకులు తాజా అథ్యయనం చేపట్టారు. ఇక నైట్రోజన్‌ డయాక్సైడ్‌కు దీర్ఘకాలం ఎక్స్‌పోజ్‌ అయితే గుండె జబ్బులు, స్ట్రోక్‌ ముప్పు అధికమని అథ్యయనం పేర్కొంది. గుండె, ఊపిరితిత్తుల జబ్బులకు వాయు కాలుష్యం ప్రధాన రిస్క్‌ ఫ్యాక్టర్‌గా గుర్తించాలని అథ్యయనం స్పష్టం చేసింది.


VIDEOS

logo