మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Health - May 10, 2020 , 11:18:57

ప‌డ‌క‌గ‌దిపై లాక్‌డౌన్ ఎఫెక్ట్‌!

ప‌డ‌క‌గ‌దిపై లాక్‌డౌన్ ఎఫెక్ట్‌!

హైద‌రాబాద్‌: ప‌్ర‌పంచ‌దేశాలను క‌రోనా మ‌హ‌మ్మారి చుట్టుముట్ట‌డంతో దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. దీంతో జ‌న జీవ‌నం స్తంభించిపోయింది. ప్ర‌జ‌లు ఎవ‌రి ఇండ్ల‌లో వారే బంధీలుగా మారిపోయారు. అయితే ఈ లాక్‌డౌన్ ప్ర‌జ‌ల శృంగార జీవితాల‌పై కూడా తీవ్ర ప్ర‌భావం చూపుతున్న‌దని యునైటెడ్ కింగ్‌డ‌మ్‌కు చెందిన సెక్స్ అండ్ రిలేష‌న్‌షిప్స్‌ నిపుణురాలు అన‌బెల్లీ నైట్ అభిప్రాయ‌ప‌డ్డారు. 


కరోనా మహమ్మారి ప్రభావంతో ప్ర‌పంచ దేశాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాయి. అంతేగాక‌ ప్రతి ఒక్కరి జీవనశైలిలో భౌతిక దూరం అనేది తప్పనిసరిగా మారింది. దీని ప్ర‌భావం అన్ని ర‌కాల సంబంధాల‌పై ఎంతో కొంత క‌నిపిస్తున్నా.. లైంగిక సంబంధాల‌పై మాత్రం తీవ్రంగా ఉన్న‌ది. క‌రోనా విస్త‌ర‌ణ‌, లాక్‌డౌన్ కార‌ణంగా చాలామంది మాన‌సికంగా ఒత్తిడికి లోన‌వుతున్నార‌ని, దీంతో శృంగారంపై మునుప‌టిలా ఆసక్తి చూప‌లేక‌పోతున్నార‌ని కొన్ని స‌ర్వే సంస్థ‌లు చేసిన అధ్య‌య‌నాలు కూడా స్ప‌ష్టం చేస్తున్నాయి. 

కౌన్సెలింగ్ డైరెక్ట‌రీ అనే ఒక సంస్థ చేసి స‌ర్వే ప్ర‌కారం.. లాక్‌డౌన్ కార‌ణంగా ఉద్యోగాలు చేసే ప‌రిస్థితి లేక‌పోవ‌డం, ఆర్థిక రాబ‌డి ఆగిపోవ‌డం లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌నం ఒత్తిడికి లోన‌వుతున్నార‌ట‌. ఇలా మ‌నిషి ఒత్తిడికి లోనైన‌ప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంద‌ట‌. ఈ హార్మోన్ శృంగారంపై కోరిక‌ల‌ను త‌గ్గించ‌డంగానీ, లేదా పూర్తిగా కోరిక‌లు క‌లుగ‌కుండాగానీ చేస్తుంద‌ట‌. అందుకే మ‌న‌సు ఆందోళ‌న చెందుతున్న‌ప్పుడు శృంగారంలో పాల్గొన‌డం అసాధ్య‌మ‌ట‌. 

తాను చాలా మంది జంటలకు కౌన్సెలింగ్ ఇచ్చాన‌ని, లాక్‌డౌన్ వల్ల చాలామంది వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లకు లోనై మానసిక సమస్యల బారిన‌ప‌డుతున్నార‌ని, దాంతో శృంగారంపై ఆస‌క్తి కోల్పోతున్నార‌ని కౌన్సెలింగ్ డైరెక్టరీ సభ్యులు మోనికా డెడ‌స్ చెప్పారు. లాక్‌డౌన్ వ‌ల్ల 24 గంట‌లూ భ‌ర్త‌భార్య ఒకేచోట క‌లిసి ఉంటుండ‌టం కూడా వారిలో సాన్నిహిత్యం దెబ్బ‌తిని శృంగారానికి దూర‌మ‌య్యేలా చేస్తుంద‌ని మోనికా చెబుతున్నారు. 

అయితే కొన్ని జంటలు మాత్రం లాక్‌డౌన్ మొద‌లైన రెండు వారాల వ‌ర‌కు శృంగారాన్ని తెగ ఎంజాయ్ చేశామ‌ని, ఆ త‌ర్వాత ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింద‌ని చెప్పిన‌ట్లు మోనికా తెలిపారు. లాక్‌డౌన్ వ‌ల్ల 24 గంట‌లూ పిల్లలు, పెద్ద‌వాళ్లు ఇండ్ల‌లోనే ఉండ‌టంవ‌ల్ల తాము శృంగారంలో పాల్గొనేందుకు ఏకాంత స‌మ‌యం దొర‌క‌డం లేద‌ని మ‌రికొన్ని జంట‌లు తెలిపిన‌ట్లు కౌన్సెలింగ్ డైరెక్ట‌రీకి చెందిన మ‌రో స‌భ్యుడు బెవ‌ర్లీ హిల్స్ తెలిపారు. ఇలా ఎన్నో ర‌కాలుగా లాక్‌డౌన్ ప‌డ‌క‌గ‌దిపై ప్ర‌భావం చూపుతోంద‌ని నిపుణులు తెలిపారు. 


logo