శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Health - Jun 10, 2020 , 17:23:11

ఒత్తిడిని తగ్గించే మెడిసిన్.. అదే!

ఒత్తిడిని తగ్గించే మెడిసిన్.. అదే!

చిన్నతనంలో ఏ కల్మషం లేకుండా నవ్వినట్టే పెద్దయ్యాక కూడా నవ్వితే ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు నిపుణులు. ఉద్యోగాలు, వ్యాపారాల బిజీలో పడి చాలామంది నవ్వుకు దూరమవుతున్నారు. ఇలాంటి వారు కడుపుబ్బా నవ్వితే సమస్యలు కూడా తీరిపోతాయట.

నవ్వు ఒత్తిడిని తగ్గించే ఒక మెడిసిన్ అంటున్నారు అమెరికన్ వైద్యులు. ఫ్లోరిడాకు చెందిన వైద్యబృందం నవ్వు-మానసిక ఆరోగ్యం అంశంపై అధ్యయనం చేసింది. వారి అధ్యయనం ప్రకారం..నవ్వు వల్ల మనసు ఉల్లాసపడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నవ్వు ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. గట్టిగా నవ్వడం వల్ల శరీరానికి ఆక్సిజన్ కూడా బాగా అందుతూ గుండె సంబంధిత రోగాలు దరిచేరవు.

నవ్వితే శరీరంలోని 108 కండరాలు ఉత్తేజితం అవుతాయి. బీపీ అదుపులో ఉంటుంది. 15 నిమిషాల పాటు నవ్వితే శరీరంలోని సుమారు 40 కేలరీలు కరిగిపోతాయి. నొప్పుల నివారణకు తోడ్పడే ఎండార్ఫిన్ నవ్వు ద్వారా లభిస్తుంది. డిప్రెషన్‌లో ఉన్నవాళ్లకు లాఫింగ్ థెరఫీ ట్రీట్‌మెంట్ చేస్తే 70% సత్ఫలితాలు లభిస్తాయి. థైరాయిడ్, మైగ్రేన్, స్పాండిలైటిస్ వంటి సమస్యలకు నవ్వుతో పరిష్కారం చూపవచ్చు.


logo