ఆదివారం 07 జూన్ 2020
Health - Mar 31, 2020 , 18:37:22

కరోనా వైరస్ తో చనిపోతే దహన సంస్కారాలు ఎలా చేస్తారు?

కరోనా వైరస్ తో చనిపోతే దహన సంస్కారాలు ఎలా చేస్తారు?

కరోనా వైరస్‌ సోకి మరణించిన వారి మృత దేహానికి అంత్యక్రియలు ఎలా చేస్తారు?, శవాన్ని కుటుంబ సభ్యులకు చూపిస్తారా.. ఇలాంటి ఎన్నో సందేహాలున్నాయి చాలా మందిలో..కరోనాతో చనిపోయిన వారు ఏ మతం, ఏ కులానికి చెందిన వారైనా.. శవాన్ని దహనం చేస్తారు.  శవాన్ని పూడ్చి పెట్టడానికి అనుమతి ఉండదు. ఒకవేళ శవాన్ని పూడ్చిపెట్టాలని కుటుంబ సభ్యులు పట్టుపడితే.. ప్రభుత్వం  నుంచి అనుమతి తప్పనిసరి. కరోనాతో చనిపోయిన వ్యక్తి శవాన్ని లీక్ ఫ్రూఫ్ ప్లాస్టిక్ జిప్ బ్యాగ్ లో ఉంచుతారు. దానిపై సోడియం ద్రావణం చల్లుతారు. ఆ బ్యాగ్ ను మార్చురీ షీట్ తో కుట్టి కుటుంబ సభ్యులకు ఇస్తారు. శవాన్ని విద్యుత్ దహన యంత్రంలో దహనం చేస్తారు. బూడిదను మాత్రం కుటుంబీకులకు ఇస్తారు.


logo