శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Jun 20, 2020 , 14:45:34

తొడ‌లు లావుగా ఉన్నాయా? అయితే ఆరోగ్యంగా ఉన్న‌ట్టే..

తొడ‌లు లావుగా ఉన్నాయా? అయితే ఆరోగ్యంగా ఉన్న‌ట్టే..

మ‌హిళ‌ల్లో చాలామందికి తొడ‌లు లావుగా ఉండి కాళ్లు స‌న్న‌గా ఉంటాయి. దీంతో ఎదుటివాళ్లు ఆట‌ప‌ట్టిస్తుంటారు. అంద‌రూ అంటున్నార‌ని లావు త‌గ్గేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. ఇక ఆ ప్ర‌య‌త్నాలు ఆపేయండి. ఎందుకుంటే ఇలా ఉంటే ఆరోగ్యంగా ఉన్న‌ట్లే అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే..

తొడ‌లు లావుగా ఉండే వ్య‌క్తుల‌కు బీపీ త‌క్కువ ఉండ‌డంతోపాటు గుండె సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు ఇత‌రుల‌తో పోలిస్తే చాలా త‌క్కువ‌గా ఉంటుంద‌ని అధ్య‌య‌నంలో తేలింది. 40 ఏళ్లు పైబడిన వారిలో అధిక బరువు (స్థూలకాయులు) ఉన్న 9,250 పురుషులు, స్త్రీలు.. సాధారణ బరువుతో ఉన్న 4,172 మంది పురుషులు, స్త్రీలపై అధ్యయనం చేశారు నిపుణులు. చైనాలోకి షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జెన్ యాంగ్ ఈ రీసెర్చ్‌లో పాల్గొన్నారు.

పురుషుల్లో తొడ చుట్టుకొల‌త 55 సెం.మీ కంటే ఎక్కువ, మ‌హిళ‌ల్లో 54 సెం.మీ. కన్నా ఎక్కువగా ఉన్న‌వారిలో బీపీ స్థిరంగా ఉంద‌ని తేలింది. అలాగే గుండెపోటు వ‌చ్చే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంద‌ని జ‌ర్న‌ల్‌లో పేర్కొన్నారు. ఈ ప‌రిమాణం కంటే త‌క్కువ‌గా ఉంటే ర‌క్త‌పోటు పెరిగే అవ‌కాశం ఉంద‌ని కూడా గుర్తించారు. ఉద‌రంలోని కొవ్వుకు వ్య‌తిరేఖంగా కాళ్లు, చేతుల్లోని కొవ్వు జీవ‌క్రియ‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. తొడ కొవ్వు పరిమాణం, తొడ కండరాల బరువు, తొడ ఎముక బరువు, అక్కడ ఉండే ప్రోటీన్ల ఆధారంగా వీటికి రక్తపోటుకు సంబంధం ఉందా అనే కోణంలో రీసెర్చ్ చేయనున్నట్లు యాంగ్ వివరించారు.


logo