సోమవారం 28 సెప్టెంబర్ 2020
Health - Mar 24, 2020 , 14:47:39

లాక్‌డౌన్‌లో లాహిరిలాహిరిగా..

లాక్‌డౌన్‌లో లాహిరిలాహిరిగా..

పండుగ స‌మ‌యం ఆస‌న్న‌మైంది. పైగా ఇంట్లోనే కూర్చొని ఆ పాత సీరియ‌ల్‌నే చూస్తూ కూర్చుంటున్నారా? ఫ‌న్‌లో ప‌డి స‌మ‌యాన్ని పాడుచేసుకోండా ఈ లాక్‌డౌన్‌లో ఎలాంటి మంచి ప‌నులు చేయొచ్చో చ‌దువండి.. 

1. ఇంట్లో ప్రతి ఒక్కరినీ పనిలో భాగం చేయండి. ప్రతీ సభ్యుడి బలానికి అనుగుణంగా పనులను విభజించండి. వారు ఉత్తమంగా చేసే వాటిని చేయనివ్వండి (లేదా దానిని ఒక ఆటగా మార్చండి .  చిట్టిలు రాసి ఆ ప‌ని ఎవ‌రికి వ‌స్తే వారు చేసేలా చేస్తే ప‌ని మ‌రింత సులువ‌వుతుంది.)

2. ప్రతి ఒక్కరూ వారు ఉపయోగించే వస్తువులకు బాధ్యత వహించండి- అంటే, ప్రతి ఒక్కరూ వారు తిన్న‌వాటిని క‌డ‌గ‌డం, స్నానం చేశాక బాత్రూమ్‌ను శుభ్రపరుచాలి. పెంపుడు జంతువుల‌ను ఎక్కువగా ఇష్టపడేవారు, వాటి శుభ్ర‌త గురించి ప‌ట్టించుకోవాలి. 

3. అవ‌స‌ర‌మైతేనే పై అంతస్తుల‌కు వెళ్లండి. ఒక వేళ వెళ్లాల్సి వ‌స్తే.. ప్రతిరోజూ వాటిని ఊడ‌వాలి. కాని ప్రత్యామ్నాయ రోజులలో వాటిని తుడుచుకోండి.

4. పిల్లలను శుభ్రపరిచే పనుల్లో పాలు పంచుకొనేలా చేయాలి. బొమ్మలు స‌ర్ద‌డం, బట్టలు ఆరబెట్టడం, మొక్కలకు నీళ్ళు పెట్టడం చాలా సులభం. క‌ష్టం లేని, హానిచేయని పనులను చిన్నపిల్లల‌కు అప్ప‌గించ‌వ‌చ్చు. 


5. ప్ర‌తిరోజూ, ఒకటి లేదా రెండు కొత్త శుభ్రపరిచే పనులను ఎంచుకోండి, అవి 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోవు. ఉదాహ‌ర‌ణ‌కు టెలివిజన్ స్క్రీన్‌ను శుభ్రపరచడం లేదా  చెత్త పారవేయడం, వంట గ‌ది శుభ్రపరచడంలాంటి ప‌నులు ఆలూమ‌గ‌లు క‌లిసి చేయండి. 

6. చాలా నగరాలు లాక్డౌన్లో ఉన్నందున బ‌య‌ట కూర‌గాయ‌లు దొర‌క‌డం క‌ష్టంగా ఉంది. కాబ‌ట్టి రోజుకు ఒక కూర చొప్పున వండ‌డం అల‌వాటు చేసుకోండి. వంట గురించి తెలియని వారికి వంట నేర్చుకోవ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం. మ‌గ‌వాళ్ల‌కు, పిల్ల‌ల‌కు వంట‌కి సంబంధించిన క్లాసులు తీసుకోండి. 

7. లేవ‌గానే బెడ్‌షీట్స్ మ‌డ‌త‌బెట్ట‌డం చాలామందికి అల‌వాటు ఉండ‌దు. కానీ ఈ స‌మ‌యంలో అన్ని శుభ్రంగా ఉంచుకోవ‌డం చేయాలి. అందుకే బెడ్ షీట్‌ల‌ను, బ‌ట్ట‌ల‌ను ఎప్ప‌టిక‌ప్ప‌డు మ‌డ‌త పెట్టేయండి.  

8. ఇంట్లో ఉన్న‌మ‌ని నీటిని ఎక్కువ నీటిని వినియోగించొద్దు. అవ‌స‌రాల‌కు స‌రిప‌డా నీటిని మాత్ర‌మే వాడుకోండి. ఎప్ప‌టిక‌ప్పుడు చేతుల‌ను శుభ్రం చేసుకోవ‌డం మాత్రం మ‌రువ‌ద్దు.logo