విట‌మిన్ సి త‌గ్గితే ప‌క్ష‌వాతం..?


Tue,November 20, 2018 03:17 PM

మ‌న శ‌రీరానికి అవ‌సరం అయ్యే అన్ని ఇత‌ర విట‌మిన్ల లాగే విట‌మిన్ సి కూడా మ‌న‌కు అవ‌స‌ర‌మే. అయితే ఈ విటమిన్ ఉన్న ఆహారాల‌ను చాలా మంది తీసుకోరు. విట‌మిన్ సి నే క‌దా, త‌గ్గితే ఏమ‌వుతుందిలేన‌ని నిర్ల‌క్ష్యం వ‌హిస్తుంటారు. కానీ ఈ విట‌మిన్ కూడా మ‌న‌ శరీరానికి ఎంతో అవసరం అని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ న్యూరాలజీ పేర్కొంటోంది. ఎందుకంటే ఇది తక్కువయితే మెదడులో రక్తం గడ్డకట్టి పక్షవాతం వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా మెదడుకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం వల్ల పక్షవాతం వస్తుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మెదడు కణజాలంలో రక్తనాళికలు చిట్లి రక్తం గడ్డలు కట్టడంవల్లనూ పక్షవాతం వస్తుంది. అలాంటి సందర్బాల్లో మరణం కూడా సంభవించవచ్చు. శరీరంలో విటమిన్‌-సి శాతం తక్కువయితే ఈ రకమైన ప్రమాదం రావచ్చ‌ని సదరు పరిశోధకులు తెలియ‌జేస్తున్నారు. ఇందుకోసం కొందరు పక్షవాత బాధితుల్ని పరిశీలించగా వాళ్లందరిలోనూ విటమిన్‌-సి చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. కాబట్టి సి-విటమిన్‌ లోపాన్ని తేలికగా తీసుకోకూడదనీ దీనికితోడు బీపీ ఉండి, ఆల్కహాల్‌ తీసుకునే అలవాటూ ఉంటే అది స్ట్రోక్‌కు దారితీసే అవకాశం ఎక్కువని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, సి-విటమిన్‌ లోపం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి రోజూ సి-విటమిన్‌ అధికంగా ఉండే సంత్రాలు, బొప్పాయి, జామ, స్ట్రాబెర్రీ, ఉసిరి వంటి పండ్లను తప్పనిసరిగా తినమని వైద్యులు సూచిస్తున్నారు.

3489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles