సన్‌గ్లాసెస్ కొంటున్నారా..? అయితే ఇది తెలుసుకోండి..!


Wed,October 31, 2018 12:15 PM

మనలో చాలా మంది బయటకు వెళ్లినప్పుడు సన్‌గ్లాసెస్ పెట్టుకుంటారు. కొందరు కళ్లలో దుమ్ము పడకుండా ప్రొటెక్షన్ కోసం సన్ గ్లాసెస్ పెట్టుకుంటే.. కొందరు ఎండ, తీవ్రమైన కాంతిని తట్టుకోవడం కోసం కళ్లకు రక్షణగా గ్లాసెస్‌ను ధరిస్తారు. అయితే చాలా మంది సన్‌గ్లాసెస్ ఎంపిక విషయంలో పొరపాటు పడుతుంటారు. ఎందుకంటే.. సన్‌గ్లాసెస్ అయితే కొనుగోలు చేస్తారు కానీ.. వాటికి ఎలాంటి ఫీచర్లు ఉంటాయి..? అనే వివరాలను మాత్రం తెలుసుకోరు. కానీ అవి చాలా ముఖ్యం.. అవేమిటంటే...

సన్‌గ్లాసెస్‌ను కొనుగోలు చేసేటప్పుడు కేవలం దుమ్ము కోసం ప్రొటెక్షన్‌గా వాటిని కొనుగోలు చేస్తే ఓకే. లేదూ.. ఎండ, కాంతిని తట్టుకునేందుకు కొనుగోలు చేస్తున్నాం అనుకుంటే.. సన్ గ్లాసెస్‌కు యూవీ ప్రొటెక్షన్ ఉందా, లేదా అన్న విషయం చెక్ చేసుకోవాలి. యూవీ ప్రొటెక్షన్ ఉన్న సన్ గ్లాసెస్ అయితే మన కళ్లకు సూర్య కాంతి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షణను ఇస్తాయి. అలాగే పోలరైజ్డ్ లెన్స్‌లు ఉండే గ్లాసెస్‌ను కొనుగోలు చేస్తే మరీ మంచిది. అవి తీవ్రమైన కాంతి నుంచి కళ్లకు రక్షణనిస్తాయి. బాగా కాంతివంతమైన వస్తువులను చూసేందుకు, అలాంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఈ తరహా లెన్స్‌లు ఉన్న గ్లాసెస్ అయితే పర్‌ఫెక్ట్‌గా పనిచేస్తాయి. కళ్లకు రక్షణ లభిస్తుంది. ఇక మనలో చాలా మందికి షేడ్ ఎక్కువ ఉంటేనే గ్లాసెస్ ప్రొటెక్షన్ ఎక్కువ కల్పిస్తాయి అనే అపోహ ఉంది. అది ఎంత మాత్రం నిజం కాదు. షేడ్‌కు, ప్రొటెక్షన్‌కు సంబంధం లేదు. పైన చెప్పిన రెండు ఫీచర్లు గ్లాసెస్‌కు ఉన్నాయో, లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. అవి రెండు ఉంటే షేడ్ తక్కువ ఉన్నా ఏమీ కాదు. కళ్లకు రక్షణ బాగా లభిస్తుంది.

2067

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles