బుధవారం 20 జనవరి 2021
Health - Nov 30, 2020 , 19:15:08

ఇలా చేస్తే మోకాళ్ల నొప్పులు మాయం..!

ఇలా చేస్తే మోకాళ్ల నొప్పులు మాయం..!

హైద‌రాబాద్ : ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా వస్తున్న సమస్యల్లో ఒకటి మోకాళ్ల నొప్పులు. అరవైల్లో రావాల్సిన మోకాళ్ల నొప్పులు చిన్నవయసులోనే రావడంతో ఎంతో మంది చాలా రకాలుగా బాధ పడుతున్నారు. కాసేపు ఒకే చోట నిలబడ్డా.. మెట్లు ఎక్కినా, చాలా దూరం నడిచినా కూడా మోకాళ్లు ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా కింద కూర్చోవాలంటే నరకం అంచులదాకా వెళ్లి వచ్చినట్టు ఫీల్ అయేవారు చాలా మందే ఉన్నారు. అయితే.. డాక్టర్లు, మందులు లేకుండానే వీటిని తగ్గించుకోవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలని ఉందా.. అయితే పదండి మరీ..

వ్యాయామం..

మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం లాంటివి చేయకుండా అప్పుడప్పుడు లేచి అటు ఇటు నడవడం లాంటివి చేయాలి. ఉదయాన్నే యెగా,  వ్యాయామం చేయడం వల్ల కూడా మోకాళ్ల నొప్పులు తర్వగా తగ్గుతాయి. ముఖ్యంగా హిప్ మూవ్‌మెంట్ లాంటివి చేయడం వల్ల మోకాళ్లు బలంగా తయారవుతాయి. 

నిమ్మ కాయ -నువ్వుల నూనె..

నిమ్మకాయ మోకాళ్ళ నొప్పులకు మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. నిమ్మకాయను రెండు ముక్క‌లుగా కట్ చేసి.. వాటిని ఓ గుడ్డలో కట్టి ఉంచాలి. దీన్ని గోరువెచ్చని నువ్వుల నూనెలో ముంచాలి. అలా ముంచి ఐదు నుంచి పది నిమిషాల పాటు మోకాళ్ల మీద పెట్టి ఉంచాలి. ఇలా త‌ర‌చుగా చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. సిట్రస్‌ యాంటీ-ఇన్ప్లమేటరీ గుణాలను కలిగి ఉన్న నిమ్మకాయను.. తినే ఆహారంలోనో కలుపుకోవడం. లేదా.. వేడి నీళ్లలో కలుపుకుపి తాగడం లాంటివి చేయడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయట. 

అల్లం టీ..

మోకాళ్ల నొప్పి అధికంగా ఉన్నప్పుడు అల్లం టీ తాగితే మంచిది. ఒక గ్లాసు నీటిలో చిన్న అల్లం ముక్కను, సగం చెంచా పసుపును వేసి 10-15 నిమిషాలు మరిగించి తేనె కలుపుకుని తాగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే క్రమంగా మోకాళ్ల నొప్పులు తగ్గుతుంటాయి.

పసుపు..

పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మోకాళ్ళ నొప్పులను నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక టీస్పూన్ ప‌సుపు, 1 టీస్పూన్ చ‌క్కెర పౌడ‌ర్‌, 1 టీస్పూన్ లైమ్ పౌడ‌ర్‌ల‌ను తీసుకుని వాటిని త‌గినంత నీటితో బాగా క‌ల‌పాలి. దీంతో మెత్త‌ని, చిక్క‌ని పేస్ట్ త‌యార‌వుతుంది. ఈ పేస్ట్‌ను రాత్రి పూట స‌మ‌స్య ఉన్న ప్రాంతంలో రాయాలి. ఉద‌యాన్నే క‌డిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే నొప్పులు మాయామవుతాయి. పసుపు మిక్స్‌ చేసిన పాలు తాగడం కూడా ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.


logo