శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Jul 06, 2020 , 19:23:58

ఊపిరితిత్తులు ప‌దికాలాలపాటు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి!

ఊపిరితిత్తులు ప‌దికాలాలపాటు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి!

శ్వాసకోశ వ్యవస్థకు మూల‌కేంద్రం ఊపిరితిత్తులు. మ‌రి దీని విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే ఎలా. శ‌రీరం కోసం ఎలాంటి వ్యామాయాలు, యోగాలు చేస్తారో ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం కూడా అంతే జాగ్ర‌త్త తీసుకోవాలి. ఒక‌వేళ జాగ్ర‌త్త‌లు తీసుకున్నా వాతావ‌ర‌ణ కాలుష్యం సైతం ఊపిరితిత్తుల‌కు హాని క‌లిగిస్తాయి, అందుక‌నే వాటిని సంర‌క్షించుకోవ‌డానికి నిపుణులు  కొన్ని నివార‌ణ చ‌ర్య‌లు చెప్పారు. అవేంటో చూద్దాం. 

ధూమపానం మానేయాలి :

ఊపిరితిత్తుల‌కు పెద్ద శ‌త్రువు పొగ‌. ర‌క‌ర‌కాల ఊపిరితిత్తుల వ్యాధుల‌కు గురిచేస్తుంది. పొగ తాగిన‌వారికే ఈ స‌మ‌స్య వ‌స్తే ప‌ర్వాలేదు. ప‌క్క‌నున్న వాళ్లు ఎవ‌రైనా ఈ పొగ తాగినా వారికి హాని క‌లుగుతుంది. కాబ‌ట్టి మీకోసం కాక‌పోయినా మీకు ఇష్ట‌మైన వారికోసం అయినా ధూమ‌పానం మానేయండి. పొగ‌లేని వాతావ‌ర‌ణాన్ని ప్రోత్స‌హించండి.  


శ్వాస వ్యాయామం :

ఈ వ్యాయామాలు ఊపిరితిత్తుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేసేలా చేస్తాయి. లోతుగా శ్వాస‌తీసుకుంటూ వ్యాయామం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల‌కు ఆక్సిజ‌న్ అంది ప‌నితీరును పెంచుతుంది. ఉద‌యం లేవ‌గానే వ్యాయామం చేస్తే మంచిది. దీనివ‌ల్ల ఒత్తిడి త‌గ్గి ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను మెరుగుప‌రుస్తుంది.  


కాలుష్యానికి దూరంగా : 

కాలుష్యానికి కాస్త దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో ఎక్క‌డ చూసిన వాతావ‌ర‌ణం కాలుషిత‌మైన‌దే. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది. అందుక‌ని అధిక కాలుష్య స్థాయిలున్న ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించ‌డం మానేయాలి. దీని భారిన ప‌డ‌కుండా ఉండేందుకు ముఖానికి ముసుగు ధ‌రించడం మంచిది.   

డైట్ కూడా మార్చుకోవాలి :

ఆయిల్ ఫుడ్ ఎక్కువ‌గా తినేవాళ్లు. ఇప్ప‌టి నుంచి అయినా కాస్త జాగ్ర‌త్త‌గా తినాలి. ఎప్పుడు ప‌డితె అప్పుడు తిన‌కుండా.. స‌రైన వేళ‌ల్లో కొంచెం కొంచెం తింటూ ఉండాలి. ఒకేసారి అధిక మొత్తంలో తిన‌కుండా కొంచెం కొంచెం తిన‌డం మంచిది అంటున్నారు నిపుణులు. logo