ఈ రోజుల్లో జుట్టు రాలిపోవడం అన్నది పెద్ద సమస్యగా మారింది. ఒత్తయిన కేశాలు మన ఆరోగ్యాన్నీ, కేశ సంరక్షణ అలవాట్లను తెలియజేస్తాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు, ఇతర పోషక పదార్థాలు ఉన్న సమతుల ఆహారం జట్టుకు బలాన్నిస్తుంది. రాలిపోవడాన్ని కూడా అరికడుతుంది. ఈ సమస్యకు పోషకాహార నిపుణులు కొన్ని స్మూతీలను సూచిస్తున్నారు. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే కేశ సౌందర్యం ఇనుమడిస్తుంది.
కావలసిన పదార్థాలు:
నారింజ పండ్లు: 2, స్ట్రాబెర్రీ: 8 నుంచి 10,
అరటిపండు: సగం, కివీ: 1, దానిమ్మ పండు: సగం, పాలు: 100 గ్రాములు.
తయారీ విధానం: అన్ని పదార్థాలనూ బ్లెండర్లో వేసి బాగా కలపండి. రుచి కోసం కాస్త చక్కెర జోడించండి. ఐస్ క్యూబ్ వేసి సర్వ్ చేయండి.
కావలసిన పదార్థాలు:
తక్కువ కొవ్వు ఉన్న పాలు: 2 కప్పులు, బ్లూబెర్రీ: సగం కప్పు, స్ట్రాబెర్రీ: సగం కప్పు, యోగర్:్ట సగం కప్పు (లేదా పెరుగు),
ఓట్స్: 2 టేబుల్ స్పూన్లు, వీట్ జెర్మ్: 2 టేబుల్ స్పూన్లు,
నువ్వులు, పొద్దుతిరుగుడు, గుమ్మడి, చియా గింజలు: ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున.
తయారీ విధానం: అన్నిటినీ బ్లెండర్లో వేసి కలపండి. స్మూతీ సిద్ధం.
కావలసిన పదార్థాలు:
బెల్ పెప్పర్స్: 2, టమాట: 4,
బేబీ క్యారెట్లు: 3, బచ్చలి కూర: 2 కట్టలు, దోసకాయ: 1, అల్లం: అంగుళం ముక్క.
తయారీ విధానం: కూరగాయలను చక్కగా తరుక్కోవాలి. వాటిని బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. మిశ్రమానికి నిమ్మరసం,
పుదీనా కూడా కలుపుకోవచ్చు.
మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్
www.trudiet.in