లివర్‌ను శుభ్రపరిచే బెల్లం..!


Sun,October 7, 2018 04:09 PM

నేటి తరుణంలో చాలా మంది తీపి కోసం కేవలం చక్కెరను మాత్రమే వాడుతున్నారు. కానీ నిజానికి చక్కెర కన్నా బెల్లం వాడకం మనకు ఎంతో శ్రేయస్కరం. బెల్లంలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. దీని వల్ల అధికంగా క్యాలరీలు చేరుతాయన్న బెంగ, అధిక బరువు పెరుగుతామన్న భయం ఉండవు. అలాగే పలు అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ బెల్లం అమోఘంగా పనిచేస్తుందని సాక్షాత్తూ వైద్యులే చెబుతున్నారు. ఈ క్రమంలోనే నిత్యం రాత్రి పూట భోజనం చేశాక ఒక చిన్న బెల్లం ముక్కను రోజూ తింటే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రోజూ రాత్రి భోజనం చేశాక ఒక చిన్న బెల్లం ముక్కను తింటే జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయంలోని పలు డైజెస్టివ్ ఎంజైమ్‌లను యాక్టివేట్ చేస్తాయి. దీని వల్ల మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా మలబద్దకం, గ్యాస్, అసిడిటీ సమస్యలు కూడా ఉండవు.

2. బెల్లం మన శరీరంలోని లివర్‌కు ఎంతగానో మేలు చేస్తుంది. లివర్‌ను శుభ్ర పరిచేందుకు బెల్లం పనికొస్తుంది. నిత్యం బెల్లంను తింటుంటే లివర్‌లో ఉండే హానికర వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో లివర్ శుభ్రంగా ఉంటుంది. లివర్ సంబంధ అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. అలాగే అధిక బరువు తగ్గుతారు.

3. బెల్లంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని తింటే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంలో ఉంటాయి. దీంతో కండరాల నిర్మాణం సరిగ్గా ఉంటుంది. శరీర మెటబాలిజం సరిగ్గా ఉంటుంది. దీంతోపాటు ఒంట్లో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

12848
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles