గురువారం 01 అక్టోబర్ 2020
Health - Apr 01, 2020 , 12:02:31

మర్కజ్ నిర్వాహకులది తాలిబన్ తరహా నేరం

మర్కజ్ నిర్వాహకులది తాలిబన్ తరహా నేరం

హైదరాబాద్: దేశంలో పెద్దఎత్తున కరోనా వ్యాప్తికి కారణమైన ఢిల్లీ మర్కజ్ నిజాముద్దీన్ మసీదు నిర్వాహకులపై బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తగ్లీబీ జమాత్ నిర్వహించడం తాలిబన్ తరహా నేరమని దుయ్యబట్టారు. కరోనా వైరస్ లాక్ డౌన్ ను కచ్చితంగా పాటించాలని ఆయన ట్విట్టర్ లో ముస్లిం మతపెద్దలను కోరారు. కోరనా తరుముకొస్తున్న నేపథ్యంలో తగ్లీబీ నిర్వహించడం క్షమించరాని నేరమని ఆయన అన్నారు. ఇది నిర్లక్ష్యం కాదు.. తీవ్రమైన నేరం.. దేశం సమైక్యంగా కరోనాపై పోరాటం జరుపుతుంటే ఇలాంటి పాపానికి ఎలా ఒడిగడతారని నక్వీ ప్రశ్నించారు. కరోనా నియంత్రణలు తప్పనిసరిగా పాటించాలని ముస్లిం పెద్దలు చేసిన విజ్ఞప్తులను ఆయన ట్విట్టర్‌లో పెట్టారు


logo