శుక్రవారం 05 జూన్ 2020
Health - Apr 01, 2020 , 14:00:53

ఝూమ్.. ఎవరికివారే క్యాబినెట్ సమావేశం ఇది

ఝూమ్.. ఎవరికివారే క్యాబినెట్ సమావేశం ఇది

హైదరాబాద్‌: కరోనా కల్లోలం నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం సాధించిన ఓ చరిత్రాత్మక మైలురాయి ఇది. క్యాబినెట్ సభ్యులెవరూ లేకుండా జరిగిన క్యాబినెట్ సమావేశం గురించి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నెట్‌లో పెట్టిన ఫొటో ఆలోచింపజేసేదిగా ఉన్నది. మంత్రులందరూ ల్యాప్‌టాప్‌లు ముందరేసుకుని ఎవరి ఇళ్లల్లో వారు కూర్చున్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ఝూమ్ ఓపెన్ చేశారు. ఒకరికొకరు లింక్ చేసుకున్నారు. ఒకటి తర్వాతక ఒకటిగా అంశాలను చర్చించుకున్నారు. ఈ సందర్భంగా బోరిస్ జాన్సన్ తన ల్యాప్ టాప్ స్క్రీన్ ఫొటో తీసుకున్నారు. ఎవరికివారే యమునాై తీరే ్న్నట్టుగా కూర్చున్న మంత్రుల క్యాబినెట్ సమావేశం ఫొటో బయటి ప్రపంచానికి వెల్లడి చేశారు. ఈ ఫొటో బయటికి వచ్చిన తర్వాత శల్యపరీక్షకులు ఊరుకుంటారా? మంత్రుల యూజర్ నేమ్స్ ఏమిటా అని కొందరు.. బ్యాగ్రౌండ్స్ ఎలా ఉన్నాయా అని మరికొందరు తరచి తరచి చూసి సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.


logo